రాములోరి పండక్కి..మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్…!

మెగాస్టార్ చిరంజీవి…తెలుగు వాళ్ల‌కు ఈ పేరుతో ఉన్న ఎమోష‌న్ అలాంటి..ఇలాంటిది కాదు. తెలుగు చ‌ల‌న చిత్ర సీమపై హీరోగా మూడున్న‌ర‌ ద‌శాబ్దాలు చ‌క్రం తిప్పాడు మెగాస్టార్. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి వెళ్లి సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినా..ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఖైదీ నెం 150 తో సిల్వ‌ర్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌లే సైరా తో రేనాటి సూర్యుడు న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను ప్ర‌పంచానికి చెప్పాడు. కాగా చిరు తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:05 am, Tue, 31 March 20
రాములోరి పండక్కి..మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్...!

మెగాస్టార్ చిరంజీవి…తెలుగు వాళ్ల‌కు ఈ పేరుతో ఉన్న ఎమోష‌న్ అలాంటి..ఇలాంటిది కాదు. తెలుగు చ‌ల‌న చిత్ర సీమపై హీరోగా మూడున్న‌ర‌ ద‌శాబ్దాలు చ‌క్రం తిప్పాడు మెగాస్టార్. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి వెళ్లి సినిమాల‌కు గ్యాప్ ఇచ్చినా..ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఖైదీ నెం 150 తో సిల్వ‌ర్ స్క్రీన్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌లే సైరా తో రేనాటి సూర్యుడు న‌ర‌సింహారెడ్డి క‌థ‌ను ప్ర‌పంచానికి చెప్పాడు. కాగా చిరు తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతోంది.

ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చెయ్య‌నున్నార‌ని సమాచారం. మొద‌ట‌ ఉగాదికే విడుదల చేయాలని భావించినా.. అదే రోజు మెగాస్టార్ ట్విట్టర్​లోకి ఎంట్రీ ఇవ్వడం.. ‘ఆర్ఆర్ఆర్’ మోషన్​ పోస్టర్ రిలీజ్ కావ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల చిరు మ‌న‌సు మార్చుకున్నార‌ట‌. అందుకే రాములోరి పండుగ‌కు మెగా అభిమానుల‌కు ఫీస్ట్ సిద్ద‌మ‌వుతోంది. కాగా కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నిలిచిపోయింది. దీని ప్రభావం మూవీ రిలీజ్ పైనా పడే అవకాశముంది. మరి ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా ఆగస్టులో సినిమా వస్తుందా? పోస్ట్ పోన్ అవుతుందా అనేది చూడాలి.