Brahmamudi, January 17th Episode: దొరికిపోయిన రాజ్, కావ్యలు.. నగలు విషయం బయట పడిపోయిందిగా!
కావ్య పరువు ఎలాగైనా తీసేయాలని.. ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ప్లాన్లు వేస్తుంది రుద్రాణి. కావ్య నగలు తాకట్టు పెట్టిన రిసెప్ట్ తీసుకు రావాలని రాహుల్‌కి చెబుతుంది. మరోవైపు కావ్య నగలు ఏవని కావాలనే టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత సీమంతం పూర్తై అందరూ భోజనం చేసేటప్పుడు నగలు తాకట్టు పెట్టిన విషయం అందరి ముందూ బయట పెడుతుంది రుద్రాణి..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఎలాగైనా కనకం ఇంట్లో రచ్చ చేయాలని రాహుల్, రుద్రాణిలు కలిసి ప్లాన్ చేస్తారు. కావ్య నగలు పెట్టిన రిసెప్ట్స్ సంపాదించని రాహుల్‌కి చెబుతుంది రుద్రాణి. కావ్యని ఎలాగైనా ఇరికించాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఇక స్వప్నని రెడీ తీసుకు వెళ్తారు. అప్పుడే రుద్రాణి వస్తుంది. అందరి మెడలో నగలు దగదగామంటూ మెరిసిపోతుంటే కావ్య మెడలో ఒక్క నగ కూడా లేకపోతే ఏం అవుతుంది? దుగ్గిరాల వారి ఇంటి పెద్ద కోడలు ఇలాగేనా ఉండేది? ఏంటి నగలు ఇంకా తీసుకు రాలేదా? అని రుద్రాణి అడుగుతుంది. నా నగల గురించి మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రుద్రాణి గారు? నాకు ఇలా సింపుల్‌గా ఉండటమే ఇష్టం. నన్ను ఇలా వదిలేయమని కావ్య అంటుంది. నాకు తెలిసి నువ్వు కావ్యకి బోలెడన్ని నగలు ఇచ్చినట్టు గుర్తు అని రుద్రాణి అంటే.. అవును ఇచ్చాను.. ఈ పిచ్చి మొహానికి ఇష్టం లేదు ఏం చేస్తామని అపర్ణ అంటుంది. ఇష్టం లేదా.. లేక తేవడం కష్టమా అని రుద్రాణి కావాలనే టార్గెట్ చేస్తుంది.
తన మెడలో నగలు కావ్య మెడలో వేసిన అపర్ణ..
కావ్యా ఆగు.. ఈ రుద్రాణి అందని కాదు కానీ.. నీ నగలు ఏమయ్యాయి? నీకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. కానీ నా కోడలు అందరిలో దర్జాగా కనిపించాలి. ఉండు అని తన మెడలో నగ తీసి.. కావ్య మెడలో వేస్తుంది అపర్ణ. కావ్య వద్దని అన్నా.. తన మెడలో వేస్తుంది అపర్ణ. అది చూసి కనకం, కావ్యలు ఎంతో సంతోష పడుతుంది. ఆ తర్వాత స్వప్నను కుర్చీలో కూర్చోబెట్టి.. సీమంతం చేస్తారు. అందరూ వెళ్లి స్వప్నను ఆశీర్వదీస్తారు. అందంతా చూసి కనకం ఎంతో సంతోష పడుతుంది. ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. మరోవైపు రుద్రాణి వాళ్ల సంతోషాన్ని చెడగొట్టేందుకు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నగలు పెట్టిన ఆ రిసెప్ట్ సంపాదించావా అని అడుగుతుంది. ఇక సంతోషంతో రేయ్ నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావు. ఇప్పుడు ఆ కావ్యని ఎలా ఆడుకుంటానో చూడు అంటూ లోపలికి వెళ్తుంది.
మీ అక్కా చెల్లెళ్ల నటన చూసి చప్పట్లు కొట్టాలి..
దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ల అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటారు. అప్పుడే రుద్రాణి వస్తుంది. మీ అక్కాచెల్లెళ్ల నటన చూసి ఎన్ని సార్లు చప్పట్లు కొట్టాలి. ఇందాక మీ నటన చూసి కొట్టీ కొట్టీ వచ్చి చేతులు నొప్పి వచ్చాయి. మీ మనవరాలు దుగ్గిరాల వంశానికే తలవంపు తీసుకొచ్చేలా ఉందని రుద్రాణి అంటే.. చెంప పగలకొడతాను. ఇంకోసారి అలా మాట్లాడితే.. కావ్య ఏం చేసిందని ఇందిరా దేవి అడుగుతుంది. అప్పుడు కావ్య నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి కట్టాడని రుద్రాణి అంటుంది. దీంతో కావ్య, రాజ్‌లు కంగారు పడతారు. నువ్వు ఏం కనిపెట్టావో అది చెప్పమని అపర్ణ అంటే.. మీ బంగారు కోడలు.. నువ్వు ఇచ్చిన బంగారం తాకట్టు పెట్టి.. ఆస్పత్రి బిల్ కట్టిందని రుద్రాణి అంటుంది.
గోల్డ్ పెట్టిన విషయం బయట పెట్టిన రుద్రాణి..
దీంతో ఇందిరా దేవి రుద్రాణిని తిడుతుంది. సరే నేను చెప్పింది నిజం కాకపోతే.. రాజ్, కావ్యలు ఎందుకు అలా ఉన్నారు? సరే రాహుల్ ఫోన్ ఇవ్వు.. అందరూ చూడండి. నగలు తాకట్టు పెట్టిన రిసెప్ట్ అని చూపిస్తుంది రుద్రాణి. ఏం అత్తా.. ఇందాక గోల్డ్ గురించి రచ్చ చేశావు.. ఫంక్షన్ మూడ్ స్పాయిల్ చేయడానికి నీకు ఇప్పుడు మరో అవకాశం దొరికిందా.. నేను మొదటి నుంచీ చూస్తున్నా.. మా అత్తగారి ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఏదో ఒక గొడవ తీసుకొస్తూన ఉన్నావు. అందర్నీ అవమానించి బాధ పడి వెళ్లేలా చేస్తావు. అలా చేస్తే కానీ నీకు సంతృప్తిగా ఉండదా అంటూ రాజ్.. రుద్రాణిపై సీరియస్ అవుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..