Brahmamudi, December 7th Episode: కోమాలోకి వెళ్లిన సీతారామయ్య.. ఆస్తి పంచేస్తానన్న సుభాష్..
సీతారామయ్య కోమాలోకి వెళ్లాడని డాక్టర్ వచ్చి చెప్తాడు. దీంతో అందరూ బాధ పడతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. ఇందిరాదేవి భోజనం చేయనంటే ఒప్పించి తీసుకొస్తుంది కావ్య. భోజనం చేసే ముందు రుద్రాణి, ధాన్యలక్ష్మిలు కలిసి పెంట పెడతారు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఆస్పత్రికి కళ్యాణ్ వస్తాడు. తాతయ్యకు ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్యా అని కళ్యాణ్ అడిగితే.. డాక్టర్లు ఏమీ చెప్పలేదని రాజ్ అంటాడు. అసలు ఏమైంది అన్నయ్యగా అని కళ్యాణ్ అడిగితే.. కొంతమంది చేసిన మూర్ఖత్వం వల్ల మావయ్య గారికి ఇలా జరిగింది. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నారు చెప్పండి.. ఎంత మందికి? ఎన్ని సార్లు అని బుద్ధి చెబుతారు? అని అపర్ణ డాధ పడుతుంది. ఇంతలో డాక్టర్ వస్తాడు. మా తాతయ్యకు ఎలా ఉందని రాజ్ అడిగితే.. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ బీపీ బాగా పెరగడంతో బ్రెయిన్‌పై ప్రెజర్ పడింది. దీంతో ఆయన కోమాలోకి వెళ్లారు. ఆయన ఎప్పుడు మెలకువలోకి వస్తారో చెప్పడం కష్టమని చెప్తారు డాక్టర్. దీంతో అందరూ కంగారు పడతారు. మరోవైపు ఇందిరా దేవి బోరుమని విలపిస్తుంది. అపర్ణ, కావ్యలు సర్ది చెబుతారు. అన్నయ్యా నాన్నమ్మని ఇక్కడే ఉంచితే తాతయ్యను అలానే చూస్తూ కుంగిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ ఇంటికి వెళ్లమని కళ్యాణ్ అంటే.. నేను ఆయన్ని వదిలి పెట్టి ఎక్కడికీ రాను.. ఇక్కడే ఉంటానని ఇందిరా దేవి అంటుంది. అందరూ నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తారు.
కావ్య కోసం కనకం బాధ..
మరోవైపు కనకం ఫోన్ చేసి అన్నీ కనుక్కుంటుంది. ఆ తర్వాత చాలా బాధ పడుతూ ఉంటుంది. ఏంటి ఇలా ఉన్నావని కృష్ణమూర్తి అడిగితే.. అల్లుడి గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ ఇంటి పెద్దలు వచ్చి ఇంటికి తీసుకెళ్తే.. ఇకనైనా అల్లుడు గారు వాళ్ల మాట విని కావ్యని బాగా చూసుకుంటారని ఆశ పడ్డాం. కానీ అందరూ ఆ ఇంటికి వెళ్లాక.. ఆ రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఆస్తి పంచాలని గొడవ పెట్టుకున్నారట. వాళ్లను వారిస్తుంటే ఆ పెద్దాయనకు గుండె పోటు వచ్చిందట. ఇప్పుడే ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. పాపం చలనం లేని స్థితిలో ఉన్నారని కనకం చెబితే.. కృష్ణమూర్తి చాలా బాధ పడతాడు. పాపం ఆ పెద్దావిడ పరిస్థితి ఏంటి? అని అంటాడు. ఇప్పుడు ఈ గొడవలకు కారణం కావ్యనే అని అంటారేమోనని భయంగా ఉంది. కావ్య అడుగు పెట్టినందుకే ఆయనకు గుండె పోటు వచ్చిందని నిందిస్తారేమోనని భయంగా ఉంది. అక్కడికి ఒకసారి వెళ్దామని కనకం అడిగితే.. వద్దని కృష్ణమూర్తి అంటాడు.
బాధ పడుతున్న ఇందిరా దేవి..
ఆ తర్వాత ఇందిరా దేవి పెద్దాయనను తలుచుకుంటూ ఫొటో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి.. ఏంటి అమ్మమ్మా ఇది.. మీరే ఇలా అయితే ఇక ఇంట్లో వాళ్లు ఎంత బాధ పడతారో చెప్పండి అని కావ్య అంటే.. చెట్టు అంత మనిషి అలా ఆస్పత్రిలో ఉంటే ఎలా ఉండాలో తెలీడం లేదు. ఆయన లేకపోతే ఒంటరిగా ఎందుకు బతకాలో అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని చూస్తుంటే చచ్చిపోవాలి అనిపిస్తుందని ఇందిరా దేవి అంటుంది. అమ్మమ్మా ఆయన మీ కోసమే చావును సైతం పోరాడి నిలబడ్డారు. కానీ మీరు మాత్రం ఆ నమ్మకాన్ని కోల్పోయి ఇలా బాధ పడుతున్నారు. అమ్మమ్మగారు మీరే ఒక్కసారి ఆలోచించండి. తాతయ్య గారి ఆరోగ్యం కుదుట పడి ఇంటికి వచ్చిన రోజు మీరు ఇలా బాధ పడుతూ ఉంటే ఆయన చూసి తట్టుకోగలరా.. నా వల్ల నా చిట్టీ ఇలా అయిపోందని కుమిలిపోతారు కదా.. నా మాట వినండి.. రండి భోజనం చేద్దామని కావ్య అంటే.. నేను తినను అని ఇందిరా దేవి అంటుంది. అమ్మమ్మా మనం ప్రేమించిన వాళ్ల కోసం బాధ పడటం న్యాయం. కానీ దాని కోసం మన ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటే.. వాళ్ల మీద ఉన్న ప్రేమను అవమానించినట్టే.. మీరు తినకపోతే నేనూ తినని కావ్య అంటుంది. దీంతో సరే పదా అని వస్తుంది.
జాలి, దయ అనేవే లేవా?
అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఎదురు చూస్తారు. అన్నయ్యా ఆకలి వేస్తుంది వడ్డించుకుందామా అని రుద్రాణి అంటే.. అమ్మ రానీ అని సుభాష్ అంటాడు. అప్పుడే ఇందిరా దేవి వచ్చి కూర్చొంటుంది. ఆ తర్వాత కావ్య అందరికీ భోజనం వడ్డిస్తుంది. అప్పుడే రుద్రాణి ఆస్తి గురించి అడగమని ధాన్యలక్ష్మికి సైగ చేస్తుంది. ధాన్యలక్ష్మి నేను చేయనని అంటుంది. ఇక రుద్రాణి రంగంలోకి దిగి.. అన్నయ్యా ఏం ఆలోచించారు? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని రుద్రాణి అంటుంది. ఏ విషయంలో అని సుభాష్ అడిగితే.. అదే ధాన్యలక్ష్మి ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధ పడింది కదా.. కొంచెం కూడా జాలి, దయ అనేవే లేవా? పాపం కొడుక్కి ఆస్తి రావాలనే కదా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధ పడింది. ఈ సమయంలో నాన్నకు ఏదన్నా జరగరానిది జరిగితే ఆ తర్వాత ఏం చేయాలో తెలీకుండా పోతుందని రుద్రాణి అంటుంది. ఎంత కమీషన్‌గా తీసుకున్నారు? ధాన్యలక్ష్మి గారి తరుపున పోరాడి గెలవడానికి అని కావ్య అడుగుతుంది. ఏయ్ నోర్ముయ్ వేడి వేడి సాంబార్ నెత్తి మీద పోసి చంపేస్తాను జాగ్రత్త అని స్వప్న అంటుంది. తాతయ్య గారు ఆస్పత్రిలో ఉంటే.. పెద్దవారిని చిన్న వారిని ఓదార్చి కడుపుకు ఇంత అన్నం తినేలా చేయాలి. కానీ ఆస్తి కోసం చిచ్చు రగల్చకూడదు ధాన్యలక్ష్మి గారూ అని కావ్య అంటుంది.
నా కోడలు వండి తీసుకొచ్చింది..
చూశారా పేరు పెట్టి పిలుస్తుందని ధాన్యలక్ష్మి అంటే.. సిగ్గు ఉండాలి మామగారు ఆస్పత్రిలో ఉంటే ఆస్తుల కోసం ఆశ పడకూడదే అంటారని ప్రకాశం అంటాడు. అసలు నీకు ఏం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఏంటి ఏం సంబంధం లేదా.. నేను ఎలా ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చానో.. నా తర్వాత అది కూడా అలాగే వచ్చింది. మరి దానికేం మర్యాద ఉందని.. మా మామగారు పడేసిన భిక్షతో తిన్న దానితో అడిగిస్తున్నావని అపర్ణ అంటుంది. అక్కా రుద్రాణిని పక్కన పెట్టు.. నేను ఉరి వేసుకునే దాకా వెళ్లినా మీరు మారేలా కనిపించడం లేదు. అయినా పెద్దవాళ్లు మీరు మాట్లాడాలి కానీ.. ఎలాంటి సంబంధం లేని కావ్య జోక్యం చేసుకోవడం ఏంటి? పుట్టింట్లో గతి లేదని ఏడిస్తే మావయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటి పుట్టింట్లో గతి లేకనా.. అత్తింట్లో వండే ఆడవాళ్లు లేకపోతే.. పుట్టింటి నుంచి అన్నం వండి తీసుకొచ్చింది నా కోడలు అని అపర్ణ అంటుంది. ఏయ్ నేను ఓపిక పడుతున్నాను కదా అని మర్చిపోయి.. ఎవర్నీ లెక్క చేయకుండా మాట్లాడుతున్నావ్ ఏంటి? అని ప్రకాశం అంటాడు.
మీ పుట్టింటి వాళ్లకు గతి లేదా..
పైగా మా కావ్యకి పుట్టింట్లో గతి లేక ఇక్కడికి వచ్చిందంట. అసలు నేను కాపురానికి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నా అసలు మీకు పుట్టిల్లు అనేది ఉందా? ఉంటే ఎప్పుడూ వెళ్లలేదే? అంత గతిలేని వాళ్లా మీ పుట్టింటి వాళ్లు అని స్వప్న అంటుంది. స్పప్నా నీ హద్దుల్లో నువ్వు ఉండు అని ధాన్యలక్ష్మి అంటే.. హద్దుల గురించి ఎందుకులేమ్మా.. ఎప్పుడైనా నా తమ్ముడిని ఇంటి అల్లుడిగా ఫంక్షన్‌కో పండక్కో పిలిచారా? నా కోడలి పుట్టింటి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? అని సుభాష్ అడుగుతాడు. అయిందా బాగా అయిందా అని ప్రకాశం అంటే.. ఆగండి అందరూ కలిసి నా నోరు నొక్కేయాలని అనుకుంటున్నారా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆపండి.. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని ఇందిరా దేవి సీరియస్ అవుతుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రుద్రాణి, ధాన్యలక్ష్మిల గోల భరించలేక.. మరో ఎపిసోడ్‌లో అందరికీ ఆస్తి పంచేస్తానని సుభాష్ అంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..