Anasuya: రిపబ్లిక్ డే విషెష్ చెప్పిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కౌంటరిచ్చిన యాంకరమ్మ.. 

Anasuya: రిపబ్లిక్ డే విషెష్ చెప్పిన అనసూయ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కౌంటరిచ్చిన యాంకరమ్మ.. 

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఓవైపు బుల్లితెరపై యాంకర్‏గా

Rajitha Chanti

|

Jan 26, 2022 | 9:11 PM

ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఓవైపు బుల్లితెరపై యాంకర్‏గా కొనసాగుతూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలలో నటిస్తూ సత్తా చాటుతుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో అనసూయకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్‏లో ఉంటుంది. ఇక నెట్టింట్లో ట్రోలింగ్ బారిన పడడం అనసూయకు కొత్తేమి కాదు. ఎన్నో సందర్భాల్లో అనసూయపై నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఎప్పటికప్పుడు వారికి ధీటుగా ఆన్సర్ ఇస్తూ వచ్చింది అనసూయ. తాజాగా రిపబ్లిక్ డే విషెష్ చెప్పిన అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్.

తాజాగా అనసూయ అందరికీ రిపబ్లిక్ డే విషెష్ చెబుతూ ఎంతో అందంగా పాట పాడింది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షాలు చెప్పింది. ఈ మేరకు చేసిన వీడియోలో రెండు ఇబ్బందులు తలెత్తాయి. ఒకటి పాట పాడేటప్పుడు అనసూయ నిల్చోలేదు. ఇక రెండోది.. టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండడం. గాంధీ బొమ్మ ఎందుకు వేశావ్.. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అది రాసింది అంబేద్కర్ కదా.. అంటే అంబేద్కర్ బొమ్మ ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. బాగుంది.. నైస్.. లేచి నిల్చుని పాడితే బాగుండేది .. ఇలా చెప్పినందుకు హర్ట్ అయితే సారీ అంటూ ఓ నెటిజన్ నేరుగా కామెంట్ చేశాడు.

Anasuya

Anasuya

దీనిపై అనసూయ స్పందించింది. నేనే సారీ చెబుతున్న.. నేను నిల్చోలేదని బాగా ఫీల్ అయినట్టున్నారు… నేషనల్ ఆంథమ్ పాడేటప్పుడు గౌరవ సూచకంగా నిల్చుంటాం.. జనగనమన నేషనల్ ఆంథమ్. వందేమాతరం అనేది నేషనల్ సాంగ్. బంకిం చంద్ర ఛటర్జీ రాశారు. కానీ రవింద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా పాడారు. సారే జహాసే అచ్చా అనేది నా దేశం లోగో. ఇవన్నీ దేశభక్తి గీతాలు.. నేను ఇండియన్‏ని .. ఐ లవ్.. రెస్పెక్ట్. నా గుర్తింపుకు వ్యాల్యూ ఇచ్చుకుంటాను జై హింద్.. అంటూ కామెంట్ చేసింది అనసూయ. అలాగే గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏందని అంటారు.. మరీ జనగణమన ఏంది అంటూ తన స్టైల్లో కౌంటర్ వేసింది అనసూయ.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారో ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మతిపోగొట్టింది..

Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..

Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu