వరుణ్ తేజ్, నిహారిక పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు!

ఇక ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా నిహారిక కొణిదెల పెళ్లిపై సైతం తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారే వార్తలు వచ్చాయి కానీ అవి అబద్ధమని..

వరుణ్ తేజ్, నిహారిక పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు పెళ్లిళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అందరినీ షాక్‌ గురి చేశాడు. ఇక ఈయన వివాహం ఈ ఏడాది చివరలో ఉంటుందని రానా తండ్రి సురేష్ బాబు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇక ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా నిహారిక కొణిదెల పెళ్లిపై సైతం తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఆ మధ్య సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారే వార్తలు వచ్చాయి కానీ అవి అబద్ధమని వాళ్లే తేల్చేశారు.

ఆ తర్వాత ప్రభాస్‌తో నిహారిక పెళ్లంటూ పలు వార్తలు హల్చల్ అయ్యాయి. అయితే ఇవి కూడా రూమరే అని తేలింది. అయితే తాజాగా నిహారిక పెళ్లిపై స్పందించారు నాగబాబు. నిహారికాకి ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నాం. దాదాపు వచ్చే ఏడాది మొదటిలోనే ఆమె పెళ్లిని జరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరిలోగానీ.. 2022 ప్రథమార్థంలో గానీ వరుణ్ పెళ్లి కూడా జరిపిస్తామంటూ పేర్కొన్నారు నాగబాబు.

పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం నాపై ఉంది ఆ బాధ్యత నుంచి బయటపడితే నేను ఫ్రీ అవుతానని.. నిహారిక, వరుణ్‌ పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చారు నాగబాబు. కాగా మెగా వారసురాలిగా సినీ ఇండస్ట్రీలకి పరిచమైన నిహారికకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. దాదాపు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ టాకే వచ్చాయి. అయితే ఇప్పుడు కాస్త రొమాన్స్‌ని యాడ్ చేస్తూ.. ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు ఇటీవలే పేర్కొంది నిహారిక. ఈ మధ్యనే హాట్ హాట్ ఎక్స్‌పోజింగులతో ఫొటోలకు ఫోజులిస్తుంది. చూడాలి మరి ఈసారన్నా అదృష్టం కలిసి వస్తుందో లేదో.

Read More:

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్