ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ‘లక్ష్య’ టీజర్.. స్టోరీ గురించి దర్శకుడు ఏం చెబుతున్నాడంటే..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తన ఫెర్ఫామెన్స్‌తో యూత్‌కు బాగా అట్రాక్ట్ అయ్యాడు. డిఫరెంట్ మూవీస్‌తో అభిమానులను అలరిస్తున్నాడు.

  • uppula Raju
  • Publish Date - 11:27 am, Fri, 22 January 21
ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న 'లక్ష్య' టీజర్.. స్టోరీ గురించి దర్శకుడు  ఏం చెబుతున్నాడంటే..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. తన ఫెర్ఫామెన్స్‌తో యూత్‌కు బాగా అట్రాక్ట్ అయ్యాడు. డిఫరెంట్ మూవీస్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపును సంపాదించాడు. కాగా నాగశౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ టీజర్‌ను ఇటీవల ఆయన పుట్టిన రోజున చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో వండర్ క్రియేట్ చేస్తోంది. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ కథను దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా టీజర్‌లో నాగ్ 8 ప్యాక్‌తో అదరగొడుతున్నాడు. జగపతి బాబు వాయిస్ ఓవర్ లో మొదలైన ఈ టీజర్ ఆటలో చాలా మందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చే వాడిగా నాగశౌర్య రోల్ ను ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా మొదలైంది.

మరి అలాగే విలు విద్యలో ఆరితేరిన హీరో దానికి దూరం అవ్వడం మళ్ళీ తిరిగి రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావడం వంటివి మంచి ఇంటెన్స్ టేకింగ్ తో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చూపించారు. మరి అలాగే నాగ శౌర్య అయితే సరైన ఆర్చర్ లానే కాకుండా యాంగ్రీ యంగ్ మెన్ గా మరియు మంచి మేకోవర్ తో అవుట్ స్టాండింగ్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్మ కేతిక శర్మ చిన్న బిట్ లో కనిపించినా మంచి నటనను కనబర్చింది. ఇక ఈ టీజర్ లో మరో స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవకు ఇవ్వాలి. టీజర్‌కు కట్‌కు తగ్గట్టుగా ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ కంపోజర్ మంచి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ను అందించాడు. అయితే షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని చిత్రయూనిట్ చెబుతోంది.

వరుడు కావలెను అంటోన్న రీతు వర్మ, నాగశౌర్య ఆమెకు సరితూగుతాడా..ఈ వీడియో చూసి చెప్పండి