వివాదంలో నాగశౌర్య.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు షాక్ తగిలింది. ఆయనపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య డ్రైవర్ల పట్ల అవమానకరంగా మాట్లాడారంటూ తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల అశ్వద్ధామ అనే చిత్రంతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగశౌర్య.. చదువుకోని కొంతమంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటారని, మద్యానికి బానిసై నేరాలకు పాల్పడుతుంటారని […]

వివాదంలో నాగశౌర్య.. హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు షాక్ తగిలింది. ఆయనపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య డ్రైవర్ల పట్ల అవమానకరంగా మాట్లాడారంటూ తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల అశ్వద్ధామ అనే చిత్రంతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగశౌర్య.. చదువుకోని కొంతమంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎంచుకుంటారని, మద్యానికి బానిసై నేరాలకు పాల్పడుతుంటారని కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ.. ఆయనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.

Published On - 6:46 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu