Bigg Boss Fame Losliya: బిగ్‌బాస్ ఫేం లోస్లియా ఈస్ కమ్ బ్యాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె పోస్ట్..

Bigg Boss Fame Losliya: శ్రీలంకన్ న్యూస్ రీడర్‌ లోస్లియా తమిళ బిగ్‌బాస్ 3 విజేతగా నిలుస్తుందని అందరు అనుకున్నారు కానీ అనుకోకుండా

Bigg Boss Fame Losliya:  బిగ్‌బాస్ ఫేం లోస్లియా ఈస్ కమ్ బ్యాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె పోస్ట్..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 8:24 PM

Bigg Boss Fame Losliya: శ్రీలంకన్ న్యూస్ రీడర్‌ లోస్లియా తమిళ బిగ్‌బాస్ 3 విజేతగా నిలుస్తుందని అందరు అనుకున్నారు కానీ అనుకోకుండా రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌తో ఈమె చాలామంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత రెండు తమిళ సినిమాల్లో అవకాశాలు అందుకోగా, ఆయా మూవీ షూటింగ్స్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. అయితే ఆమె తండ్రి ఇటీవల కెనడాలో మృతి చెందారు.

తండ్రి మృతితో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన లోస్లియా ఇటీవల కోలుకొని సోషల్ మీడియలో తన ఫాలోవర్సకు ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌కు స్పందించిన అభిమానులు కామెంట్స్, లైకులు చేస్తున్నారు. లోస్లియా తిరిగి రావడంతో ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది. ఇక ఆమె క్రికెట్ స్టార్ హర్భజన్‌తో కలసి నటిస్తున్న ‘ఫ్రెండ్‌షిప్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. తన తండ్రి చనిపోకపోతే ఆమె చాలా బిజీగా మారిపోయేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కొత్త సంవత్సరం కానుకగా లోస్లియా వస్తుందనడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి లొస్లియా తండ్రి మృతి.. అప్పట్లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి..!