మీ అద్భుత విజయంలో నన్ను భాగం చేశారు.. చాలా థ్యాంక్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ.. మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇక ఈ మూవీలో అనుష్క అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో బ్రిటీష్ వారితో పోరాడిన ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఈ యోగా బ్యూటీ నటించింది. సైరాలో ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఝాన్సీ […]

మీ అద్భుత విజయంలో నన్ను భాగం చేశారు.. చాలా థ్యాంక్స్
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 12:56 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ.. మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇక ఈ మూవీలో అనుష్క అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో బ్రిటీష్ వారితో పోరాడిన ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఈ యోగా బ్యూటీ నటించింది. సైరాలో ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా అనుష్క అద్భుతంగా నటించింది. ఇక తాజాగా ఈ మూవీ విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన అనుష్క.. చిత్ర యూనిట్‌ను థ్యాంక్స్ చెప్పింది.

‘‘తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితాన్ని తెర మీద చూపించాలని రామ్ చరణ్ అనుకున్నప్పుడు.. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడి.. అంకిత భావంతో పనిచేసినప్పుడు.. వారి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నా వంతు బాధ్యతను నిర్వర్తించాను. ఈ సినిమాలో పనిచేసినందుకు చిత్ర యూనిట్ నన్ను చిత్ర బృందం ప్రశంసించింది. ఈ అద్భుత చిత్రంలో నన్ను కూడా భాగం చేసినందుకు చిరంజీవి గారికి, దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి, చరణ్‌, సైరా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. అలాగే సినిమా విడుదలైనప్పటి నుంచి నా పాత్రపై అమితమైన ప్రేమను చూపించిన ప్రేక్షకులు, నా అభిమానులందరికీ థ్యాంక్స్’’ అని అనుష్క తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. కాగా ఈ మూవీ కోసం పిలుస్తూనే అనుష్క అమెరికా నుంచి వచ్చిందని.. తన కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/B3Q2ITSnmke/

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..