రక్షా బంధన్‌: కన్నీళ్లు పెట్టిస్తోన్న సుశాంత్ సోదరి పోస్ట్‌

రక్షా బంధన్‌: కన్నీళ్లు పెట్టిస్తోన్న సుశాంత్ సోదరి పోస్ట్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ఫుత్‌ మరణించి నెలన్నరకు పైనే అవుతోంది. అయితే ఆయన మరణాన్ని అటు కుటుంబ సభ్యులు ఇటు సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 03, 2020 | 3:12 PM

Sushant sister emotional post: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ఫుత్‌ మరణించి నెలన్నరకు పైనే అవుతోంది. అయితే ఆయన మరణాన్ని అటు కుటుంబ సభ్యులు ఇటు సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ ఆయన ఙ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇవాళ రాఖీ పౌర్ణమి కాగా.. సుశాంత్‌ని తలచుకుంటూ ఆయన సోదరీమణుల్లో ఒకరైన నీతూ సింగ్(రాణి ది)‌, సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పెట్టారు.

”గుల్షన్‌, నా బేబీ, ఇవాళ నీ రోజు. ఇవాళ మన రోజు- రక్షా బంధన్‌. 35 సంవత్సరాల్లో మొదటిసారిగా నిన్ను మిస్ అవుతున్నా. పూజ పల్లెం సిద్ధంగా ఉంది, దీపం వెలుగుతూనే ఉంది. కానీ ఇవన్నీ అందుకోవాల్సిన వ్యక్తి ఇక్కడ లేరు. నీ నుదురు మీద బొట్టు పెట్టలేను, నీ చేతికి రాఖీ కట్టలేను. నీకు స్వీట్లు ఇవ్వలేను, నీ నుదురు మీద ముద్దు పెట్టలేను. నిన్ను గట్టిగా హత్తుకోలేను. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు పుట్టి మా జీవితంలో వెలుగులు నింపావు. నువ్వు ఉన్న ప్రతి చోట ప్రకాశవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు. నువ్వు శాశ్వతంగా దూరమయ్యే రోజు ఉంటుందని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు లేకుండా రక్షా బంధన్ ఉంటుందని ఆలోచించలేదు. మనమిద్దరం కలిసి ఎన్నో చేశాము. కానీ నువ్వు లేకుండా జీవించడం అన్న దాన్ని ఎలా నేర్చుకోవాలి. నువ్వే చెప్పు” అని పోస్ట్ చేశారు. ఇక సుశాంత్‌ మరో సోదరి శ్వేతా సింగ్ కిర్తి సైతం చిన్న వయస్సులో సుశాంత్‌కి రాఖీ కట్టిన ఫొటోలను షేర్ చేశారు. ను”వ్వు ఎప్పటికీ మా గౌరవానివే” అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

Read This Story Also: ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై‌.. ఆత్మహత్యకు పాల్పడుతున్న యువత

https://www.instagram.com/p/CDakTgGlVmj/?utm_source=ig_embed

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu