టాలీవుడ్‌లో ఎవరెవరు విడాకులు తీసుకున్నారంటే..!

టాలీవుడ్‌లో ఎవరెవరు విడాకులు తీసుకున్నారంటే..!

టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకుంది. మంచు మోహన్ బాబు చిన్న తనయుడు, హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతీ రెడ్డితో విడాకులు తీసుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మనోజ్.. అభిప్రాయబేధాల వలన నాలుగు సంవత్సరాల తరువాత ఆమెతో బంధాన్ని తెంచుకున్నారు. ఈ మేరకు గురువారం తన ట్విట్టర్‌లో ఒక ఎమోషనల్ లెటర్‌ను ఆయన పెట్టారు. కాగా గతంలోనూ పలువురు సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వారెవరో చూద్దాం. పవన్ కల్యాణ్: […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 3:00 PM

టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకుంది. మంచు మోహన్ బాబు చిన్న తనయుడు, హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతీ రెడ్డితో విడాకులు తీసుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మనోజ్.. అభిప్రాయబేధాల వలన నాలుగు సంవత్సరాల తరువాత ఆమెతో బంధాన్ని తెంచుకున్నారు. ఈ మేరకు గురువారం తన ట్విట్టర్‌లో ఒక ఎమోషనల్ లెటర్‌ను ఆయన పెట్టారు. కాగా గతంలోనూ పలువురు సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. వారెవరో చూద్దాం.

పవన్ కల్యాణ్: 1997లో నందిని అనే మహిళను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2008లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అయితే అప్పటికే నటి రేణు దేశాయ్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన పవన్.. 2009లో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే వీరిద్దరికి అకీరా నందన్ పుట్టగా.. వివాహం తరువాత ఆధ్య జన్మించింది. ఇక 2012లో రేణుతో కూడా విడిపోయిన ఆయన.. రష్యన్‌కు చెందిన అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలెనా అంజనా పవనోవా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు రేణు కూడా గతేడాది పుణెకు చెందిన ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే.

నాగార్జున: 1984లో ప్రముఖ నిర్మాత రామా నాయుడు కుమార్తె, నటుడు వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుబాటిని వివాహమాడారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. వీరిద్దరికి 1986లో నాగ చైతన్య జన్మించాడు. అయితే బేధాప్రియాలు రావడంతో 1990లో ఆమెకు విడాకులు ఇచ్చిన నాగార్జున.. 1992లో నటి అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత నాగార్జున, అమలకు 1994లో అఖిల్ జన్మించాడు. ఇక లక్ష్మీ దగ్గుబాటి చెన్నైకు చెందిన శరత్ అనే మరో వ్యక్తిని వివాహమాడింది.

సుమంత్: నాగార్జున మేనల్లుడైన సుమంత్.. నటి కీర్తి రెడ్డిని 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అభిప్రాయ బేధాల వల్ల రెండేళ్లల్లోనే(2006) వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సుమంత్ మరో వివాహం చేసుకోనప్పటికీ.. కీర్తి, కార్తీక్ అనే మరో వ్యక్తిని 2014లో వివాహమాడింది.

రామ చలమ్- ఊర్వశి: అలనాటి నటి, నిర్మాత అయిన రామ చలమ్.. మొదట రమణ కుమారిని వివాహం చేసుకున్నారు. అయితే 1964లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఆమె మరణించగా.. ఆ తరువాత ప్రముఖ నటి ఊర్వశి శారదను రెండో పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు కూడా విడిపోగా.. రామ చలమ్ 1989లో కన్నుమూశారు.

శరత్ బాబు- రమా ప్రభ: టాలీవుడ్ నటులైన శరత్ బాబు- రమా ప్రభ 1981లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన 1988లో వీరిద్దరు విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సింగిల్‌గానే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రకాష్ కోవెలమూడి: ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తనయుడైన ప్రకాష్ కోవెలమూడి, రచయిత కనిక దిల్లోన్‌ను 2014లో పెళ్లాడారు. వీరిద్దరు కలిసి 2015లో సైజ్ జీరో సినిమాకు పనిచేశారు. అయితే 2017లో ఈ ఇద్దరు విడాకులు తీసుకోగా.. ఈ విషయాన్ని ఈ ఏడాది కనిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తామిద్దరం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని కనిక తెలిపింది. ఇక విడాకుల తరువాత కంగనా, రాజ్‌కుమార్‌ రావులతో ప్రకాష్ తెరకెక్కించిన జడ్జిమెంటల్ హై క్యా అనే సినిమాకు కనిక రచయితగా పనిచేయడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరు కూడా సింగిల్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు.

ఇక వీరితో పాటు టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన క్రిష్ కూడా తన భార్య రమ్యతో విడాకులకు అప్లై చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరు ప్రస్తుతం సెపరేట్‌గా ఉన్నట్లు ఫిలింనగర్‌లో టాక్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu