అరుదైన జబ్బులతో బాధపడిన సెలబ్రిటీలు ఎవరంటే..!

అనోస్మియ అనే అరుదైన జబ్బుతో తాను బాధపడుతున్నట్లు అందాల భామ కేథరిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జబ్బు వలన తాను వాసనలను పసిగట్టలేనని.. అందుకే భవిష్యత్‌లో పెళ్లి చేసుకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె ఒక్కటే కాదు భారత సినీ పరిశ్రమలో ఎంతో మంది అరుదైన జబ్బులతో బాధపడుతున్నారు. వారిలో కొంతమంది తమకు వచ్చిన వ్యాధులను జయించగా.. మరికొందరు మాత్రం ఆ జబ్బులతో […]

అరుదైన జబ్బులతో బాధపడిన సెలబ్రిటీలు ఎవరంటే..!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 7:00 PM

అనోస్మియ అనే అరుదైన జబ్బుతో తాను బాధపడుతున్నట్లు అందాల భామ కేథరిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జబ్బు వలన తాను వాసనలను పసిగట్టలేనని.. అందుకే భవిష్యత్‌లో పెళ్లి చేసుకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆమె ఒక్కటే కాదు భారత సినీ పరిశ్రమలో ఎంతో మంది అరుదైన జబ్బులతో బాధపడుతున్నారు. వారిలో కొంతమంది తమకు వచ్చిన వ్యాధులను జయించగా.. మరికొందరు మాత్రం ఆ జబ్బులతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 1984లో మియాస్థేనియా గ్రేమిస్ (కండరాలు, నాడీ తంతువుల అస్వస్థత)తో బాధపడ్డారు. దీని వలన శారీరకంగా, మానసికంగా ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఇక 2000 సంవత్సరంలో ఆయన టీబీ బారిన పడ్డారు. అంతేకాదు కూలీ షూటింగ్ సమయంలో బిగ్‌బీ యాక్సిడెంట్‌కు గురవ్వగా.. ఆ సమయంలో కాలేయానికి సంబంధించిన వ్యాధితో బాధపడ్డానని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

బయటికి ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉండే బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఒకానొక సమయంలో డిప్రెషన్‌ను గురయ్యారు. షూటింగ్‌ సమయంలో ఆయన కండరాలు పలుమార్లు విరగ్గా.. 8 సార్లు సర్జరీలు కూడా జరిగాయి. అయితే ఆ డిప్రషన్‌ను అధిగమనించిన ఆయన ఇప్పటికీ తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

ఎలాంటి పాత్రలకైనా జీవం పోస్తూ లోకనాయకుడి పేరు సాధించిన కమల్ హాసన్ టైప్ 1 డయాబిటీస్‌తో బాధపడ్డారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ 2011 నుంచి ఎమిసిస్(కక్కుకోవడం)‌తో బాధపడుతున్నారు. అంతేకాదు బ్రాంకైటీస్(ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం) వలన కొన్ని రోజులు ఐసీయూలో ఆయనకు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆ తరువాత దానికి సంబంధించి సింగపూర్‌లోనూ రజనీ చికిత్స తీసుకున్నారు.

టాలీవుడ్ బేబి సమంత 2012లో పోలోమార్పోస్ లైట్ ఎరప్షన్(PLE) అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఇది చర్మానికి సంబంధించిన ఓ వ్యాధి. సూర్య కిరణాలు ఆమె చర్మాన్ని తాకితే దద్దుర్లు రావడంతో పాటు నొప్పి కూడా వచ్చేదట. దీంతో ఆమె చాలా ఇబ్బందులు పడ్డట్లు సమాచారం.

దక్షిణాదిన లేడి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఓ అరుదైన శరీర సంబంధిత రోగంతో బాధపడుతున్నారు. దీని వలన ఆమెకు మేకప్ వేసేందుకు ఇబ్బంది అవుతుందట.. ఇందుకోసం ఆమె ఇప్పటికీ మందులు వాడుతుందట. ఒకానొక సమయంలో ఆమె శరీరం మొత్తం దద్దుర్లు వచ్చాయని.. ఇక నాన్‌వెజ్ తింటే అది మరింత ఇబ్బంది పెట్టేదని నయనతార సన్నిహితుల నుంచి సమాచారం.

గోవా బ్యూటీ ఇలియాని శరీరానికి సంబంధించి డిస్మోర్పిక్ అనే అరుదైన వ్యాధితో బాధపడింది. దీని వలన డిప్రెషన్‌కు కూడా గురయ్యానని.. అయితే కుటుంబం, సన్నిహితుల ప్రోత్సాహంతో దానిని అధిగమించానని ఇలియానా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

తన సింగింగ్, యాక్టింగ్‌తో తెలుగు, మలయాళ చిత్రాల్లో రాణించిన మమతా మోహన్‌దాస్ హోడ్కివ్ లింపోమా అనే అరుదైన క్యాన్సర్ బారిన పడింది. ఆ తరువాత ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆమె 2013 క్యాన్సర్‌ను జయించారు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ట్రిజెమినల్ న్యూరల్గియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుండగా.. ఇప్పటికీ చికిత్సను తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎంతోమంది అమ్మాయిల ఆరాధ్య హీరో హృతిక్ రోషన్‌ బ్రెయిన్‌(మెదడు)లో చిన్న రంధ్రం ఉండేది. దీంతో 2013 సంవత్సరంలో ఆయన మెదడులో రక్తం గట్టకట్టింది. అయితే ఆ తరువాత దానికి చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. దీనిపై ఓ సందర్భంలో మాట్లాడిన హృతిక్.. నా మెదడులో రంధ్రం ఉన్నా.. ఆ ఆత్మస్థైరం మాత్రం ఎప్పటికీ తగ్గదని చెప్పుకొచ్చారు.

అందాల నటి సోనాలి బింద్రే అరుదైన క్యాన్సర్‌ బారిన పడింది. దీనికి సంబంధించి గతేడాది న్యూయార్క్‌కు వెళ్లిన ఆమె.. శస్త్ర చికిత్స తీసుకొని.. కోలుకుంది.

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రైన్ అనే అరుదైన క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఈ వ్యాధి సోకిన వారు బతికిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఏ మాత్రం తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోని ఇర్ఫాన్.. ట్రీట్‌మెంట్ తీసుకొని కోలుకొని.. తిరిగి షూటింగ్‌ల్లో కూడా పాల్గొంటున్నారు.

జూనియర్ ఐశ్వర్య రాయ్‌గా పిలిపించుకునే స్నేహ ఉల్లాల్ ఆలో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది వంశపారపర్యంగా వచ్చిందని.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన తరచుగా తాను జబ్బుపడుతుంటానని స్నేహ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ డిజార్టర్ నటించాలన్న తన కోరికను మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆమె తెలిపింది.

బాలీవుడ్ ఫ్యాషన్ దివ సోనమ్ కపూర్‌ చాలా సంవత్సరాల పాటు డయాబిటీస్‌‌తో బాధపడింది. టీనేజ్‌లో ఉన్న సమయంలో తనకు ఈ జబ్బు వచ్చిందని.. అయితే స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌తో దాన్ని కంట్రోల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

నేపాల్ బ్యూటీ మనీషా కొయిరాలా 2012లో అరుదైన ఓవరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ తరువాత న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆమె.. దానిని జయించారు.

బాలీవుడ్ బ్యూటీ లీసా రే 2009లో మల్టిపుల్ మైలోమా అనే అరుదైన క్యాన్సర్‌ బారిన పడింది. ఆ తరువాత చికిత్స తీసుకున్న ఆమె.. 2010లో తాను కోలుకున్నానని.. అది కూడా పూర్తిగా కోలుకున్నట్లు కాదని చెప్పుకొచ్చింది. అలాగే ఈ క్యాన్సర్‌కు పూర్తి చికిత్స లేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ప్రొమ్యోలోసైటిక్ లుకేమియా అనే అరుదైన బ్లడ్ క్యాన్సర్ బారిన పడగా.. ఆయన బతికే అవకాశం 50శాతమే ఉన్నాయని.. 2004లో డాక్టర్లు వెల్లడించారు. అయితే ఆత్మస్థైర్యంతో ఆ వ్యాధిని జయించిన ఆయన మళ్లీ తన కెరీర్‌ను కొనసాగించారు. ఇక ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘గ్యాంగ్‌స్టర్’ కథలను రాశారు.

కాగా మనిషి అన్న తరువాత జబ్బులు సహజంగా వస్తుంటాయి. అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వాటిని జయించి, మన కలలను నెరవేర్చుకోవాలని వీరిలో కొందరిని చూసి మనం నేర్చుకోవాలి.