మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి: నాని

పరిస్థితులకు అనుగుణంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలని నాచురల్ స్టార్‌ నాని అన్నారు. నాని నటించిన 25వ చిత్రం 'వి' సెప్టెంబర్ 5న

  • Tv9 Telugu
  • Publish Date - 2:12 pm, Sun, 30 August 20
మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి: నాని

Nani V Movie: పరిస్థితులకు అనుగుణంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలని నాచురల్ స్టార్‌ నాని అన్నారు. నాని నటించిన 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని, పలు విషయాలను పంచుకున్నారు.

”మా సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకున్నాం. కానీ లాక్‌డౌన్ వలన కుదరలేదు. థియేటర్లు తెరుచుకుంటాయని ఎదురుచూశాము. ఆరు నెలలు అవుతున్నా అవి తెరుచుకోలేదు. ఈ సమయంలో ఎవరో ఒకరు ముందడుగు వేసి డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలో సినిమాను విడుదల చేయాలి. మేము అదే చేశాము” అని నాని అన్నారు. ”ఏదేమైనా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు. కానీ మార్పు జరగాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు దాన్ని మొదలుపెట్టాలి. ఈ మార్పును నేను తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రయత్నం మరికొంతమందిని ఇన్‌స్పైర్ చేస్తుందని భావిస్తున్నా” అని నాని వెల్లడించారు.

కాగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి వి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సుధీర్ బాబు పోలీసు ఆఫీసర్‌గా, నాని సీరియల్‌ కిల్లర్‌గా కనిపించారు. నివేథా థామస్‌, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు నాని విలన్‌గా నటిస్తున్న ఈ మూవీపై నాని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తెలుగులో ఇప్పటివరకు లోబడ్జెట్, చిన్న హీరోల మూవీలు మాత్రమే డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో విడుదల కాగా.. మొదటిసారి నాని కొత్త  మార్పుకు శ్రీకారం చుట్టడం విశేషం.

Read More:

17 ఏళ్లుగా వ్యక్తి మెదడులో నివాసమున్న ‘వార్మ్‌’.. ఎట్టకేలకు బయటకు

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. పరుగులు తీయనున్న మెట్రో