వెండితెర అవార్డులు

వెండితెర అవార్డులు

వెండితెర అవార్డులుజమునకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్, జయసుధకు లెజండరీ అవార్డు విబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్‌ విష్ణు బొప్పన ప్రతి ఏడులాగే ఈఏడాది కూడా సినిమా అవార్డులు అందించారు. అలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులను టెక్నీషియన్లకు ప్రోత్సాహాన్నందిస్తున్నారు. గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా బుల్లి తెర అవార్డుల‌ను అందిస్తున్న విష్ణు ఇప్పుడు గ‌త‌ రెండు ఏళ్లుగా […]

Pardhasaradhi Peri

|

Sep 14, 2019 | 4:52 PM

వెండితెర అవార్డులుజమునకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్, జయసుధకు లెజండరీ అవార్డు విబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ
2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్‌టైన్‌మెంట్‌ విష్ణు బొప్పన ప్రతి ఏడులాగే ఈఏడాది కూడా సినిమా అవార్డులు అందించారు. అలాంటి అవార్డుల కార్యక్రమం ద్వారా నటీనటులను టెక్నీషియన్లకు ప్రోత్సాహాన్నందిస్తున్నారు.
గ‌త ఆరు సంవ‌త్స‌రాలుగా బుల్లి తెర అవార్డుల‌ను అందిస్తున్న విష్ణు ఇప్పుడు గ‌త‌ రెండు ఏళ్లుగా వెండి తెర అవార్డుల‌ను కూడా అందించ‌డం విశేషం. ఈ సంవ‌త్స‌రం ఇద్ద‌రు సీనియ‌ర్ అల‌నాటి హీరోయిన్ల‌కు ప్ర‌ధాన్య‌త‌నిస్తూ ఒక‌రికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును, మ‌రొక‌రికి లెజండ‌రీ అవార్డును అందించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శిల్ప‌క‌ళావేదిక‌లో శ‌నివారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో సంస్థ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ…  ‘‘ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సంవ‌త్స‌రం లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అమ్మ జ‌మున‌గారికి, లెజండ‌రీ అవార్డును జ‌య‌సుధ‌గారికి  అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జమునా, జయసుధ, బాబుమోహన్‌, సంపూర్ణేష్‌బాబు ఇంకా నరేష్‌‌, య‌మున‌, గిరిబాబు, కియారాఅద్వాని అంబిక‌కృష్ణ‌, సి.క‌ళ్యాణ్‌, రామ్‌స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. విభిన్న కేటగిరిల్లో పలువురు అవార్డులను అందుకున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu