Rashmika Mandanna: రష్మిక అల్లరి మాములుగా లేదుగా.. అలరిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు మేకింగ్‌ వీడియో..

సిల్వర్‌ స్ర్కీన్‌పై క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లతో ఎంతో చలాకీగా కనిపించే రష్మిక మందాన (Rashmika Mandanna) నిజ జీవితంలోనూ అంతే హుషారుగా ఉంటుంది. సెట్‌లో తోటి నటీనటులను నవ్విస్తూ సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది

Rashmika Mandanna: రష్మిక అల్లరి మాములుగా లేదుగా.. అలరిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు మేకింగ్‌ వీడియో..
Adavallu Meeku Johaarlu
Follow us

|

Updated on: Mar 03, 2022 | 9:49 AM

సిల్వర్‌ స్ర్కీన్‌పై క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్లతో ఎంతో చలాకీగా కనిపించే రష్మిక మందాన (Rashmika Mandanna) నిజ జీవితంలోనూ అంతే హుషారుగా ఉంటుంది. సెట్‌లో తోటి నటీనటులను నవ్విస్తూ సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది. ఆమె మోముపై కనిపించే నవ్వును చూస్తే ఎలాంటి బాధలనైనా మర్చిపోవచ్చంటూ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ లో సాయిపల్లవి (Sai Pallavi) చెప్పడం రష్మిక చలాకీతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాగా ఆమె నటించిన తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku johaarlu) మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం సినిమా మేకింగ్‌ వీడియోను ఒకటి విడుదల చేసింది. షూటింగ్‌ మొత్తం ఎంతో సరదాగా జరిగినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక షూటింగ్‌ విరామ సమయంలో రష్మిక.. చిత్రబృందంతో కలిసి ఎంత సందడి చేస్తుందో ఈ వీడియోలో మరోసారి చూడొచ్చు. ముఖ్యంగా సీనియర్‌ హీరోయిన్లు రాధిక, ఖుష్బూలతో ఆమె చేస్తున్న అల్లరి మాములుగా లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా శర్వానంద్‌, రష్మిక జంటగా నటిస్తోన్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్‌, ఖుష్బూ, ఊర్వశీ, ఝూన్సీ, వెన్నెల కిశోర్‌, రవి శంకర్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

Also Read:Viral News: జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఈ యువతి ఎంతకు తెగించిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Alia Bhatt: అలియా కంటే ముందు గంగూబాయి పాత్ర కోసం వీరిని సంప్రదించారట.. ఎందుకు తిరస్కరించారంటే..

Pooja Hegde : క్యూట్ క్యూట్ లుక్స్ తో కుర్రాకారును కట్టిపడేస్తున్న బుట్టబొమ్మ… లేటెస్ట్ (ఫొటోస్)