Ravi Teja: క్రాక్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మాహారాజా.. వరుస కడుతున్న పలువురు నిర్మాతలు..

Ravi Teja: సంక్రాంతి సందర్భంగా రిలీజైన క్రాక్ సినిమా మంచి విజయంతో దూసుకుపోతుంది. రోజు రోజుకు క్రాక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌కి

Ravi Teja: క్రాక్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మాహారాజా.. వరుస కడుతున్న పలువురు నిర్మాతలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 10:32 AM

Ravi Teja: సంక్రాంతి సందర్భంగా రిలీజైన క్రాక్ సినిమా మంచి విజయంతో దూసుకుపోతుంది. రోజు రోజుకు క్రాక్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్‌కి ప్రేక్షకులు పెరిగిపోతున్నారు. విడుదలకు ముందు కొంత సందిగ్ధత ఏర్పడినా సినిమా మంచి మౌత్ టాక్‌తో నడుస్తోంది. దీంతో హీరో రవితేజకు మునుపటి వైభవం రాబోతుంది.

క్రాక్‌తో మైండ్ బ్లాక్ అయ్యే ట్రీటిచ్చాడు రవితేజ. అది కూడా కోవిడ్ నియమనిబంధనల నడుమ 50శాతం ఆక్యుపెన్సీతో గొప్ప ఫలితం అందుకుని అందరికీ షాకిచ్చాడు. 2021 సంక్రాంతి విజేతగా మాస్ రాజా ప్రశంసలు అందుకుంటున్నాడు. హిట్టు వెంట పడే పరిశ్రమ అప్పటివరకూ వరుస ఫ్లాపుల మీద ఉన్న మాస్ రాజాను పక్కకు పెట్టింది. కొందరు పారితోషికం అడిగినంతా ఇవ్వలేమని తిరస్కరిస్తే.. మరికొందరు ఇచ్చిన అడ్వాన్సులే వెనక్కి లాక్కున్నారన్న టాక్ కూడా వినిపించింది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న రవితేజకు క్రాక్ సినిమా విజయం మంచి ఊపునిస్తుంది. దీంతో నిర్మాతలందరు మళ్లీ రవితేజ వద్దకు క్యూ కడుతున్నారు.

మాస్ మహారాజ్ కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ .. రవితేజతో రొమాన్స్ చేయనున్న ప్రణీత.?