మెగాస్టార్ పెళ్లికి ఆ హీరోయినే కారణమట..!

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి, అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో అయ్యేందుకు ఓ హీరోయిన్ కారణమట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. అప్పట్లో చిరంజీవి గురించి పెద్దగా తెలియకపోయినా.. ఆయన వివాహానికి తాను పరోక్షంగా సాయం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే రాజశ్రీ. ఓ షోలో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చిన రాజశ్రీ.. ఈ సందర్భంగా చిరు పెళ్లిపై కూడా స్పందించారు. ‘‘అల్లు రామలింగయ్య కుటుంబంతో మా కుటుంబానికి చిన్నప్పటి నుంచే మంచి […]

మెగాస్టార్ పెళ్లికి ఆ హీరోయినే కారణమట..!

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి, అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో అయ్యేందుకు ఓ హీరోయిన్ కారణమట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. అప్పట్లో చిరంజీవి గురించి పెద్దగా తెలియకపోయినా.. ఆయన వివాహానికి తాను పరోక్షంగా సాయం చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే రాజశ్రీ. ఓ షోలో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చిన రాజశ్రీ.. ఈ సందర్భంగా చిరు పెళ్లిపై కూడా స్పందించారు.

‘‘అల్లు రామలింగయ్య కుటుంబంతో మా కుటుంబానికి చిన్నప్పటి నుంచే మంచి సంబంధం ఉండేది. వాళ్ల పిల్లలతో కలిసి నేను చిన్నప్పుడు ఆడుకునే దాన్ని. ఒకసారి ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అల్లు రామలింగయ్య గారు వచ్చి కొత్తగా ఇండస్ట్రీలో ఓ కుర్రాడు వచ్చాడు. బావున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు కూడా బాగానే చేస్తున్నాడు. మా అమ్మాయి సురేఖను ఆ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నాము. మీరు ఏమంటారు అని అడిగారు. అప్పుడు నేను కొత్త అబ్బాయి.. సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్ బాగానే చేస్తున్నాడని అంటున్నారు కదా.. అంటే ఆ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది కానిచ్చేయండి అని నాతో పాటు మా కుటుంబ సభ్యులందరం ఓకే చెప్పాం. అలా చిరంజీవి, సురేఖల వివాహానికి నేను పరోక్ష కారణమని’’ ఆమె చెప్పుకొచ్చారు. అయితే సురేఖతో వివాహం జరిగే సమయానికి చిరంజీవి స్టార్ హీరో కూడా కాదు. కానీ ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

Published On - 7:53 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu