Malashree: సిల్వర్‌స్ర్కీన్‌పైకి మరో సీనియర్‌ హీరోయిన్‌ కూతురు.. ఏకంగా ఆస్టార్‌ హీరోతో కలిసి ఎంట్రీ

Malashree Daughter: ప్రేమఖైదీ, బావబామ్మర్ది, పోలీస్‌ అల్లుడు, అల్లరి పోలీస్‌, బంగారు మొగుడు, తోడి కోడళ్లు.. ఇలా పలు హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది అలనాటి నటి మాలాశ్రీ (Malashree). కేవలం హీరోయిన్‌గానే కాకుండా..

Malashree: సిల్వర్‌స్ర్కీన్‌పైకి మరో సీనియర్‌ హీరోయిన్‌ కూతురు.. ఏకంగా ఆస్టార్‌ హీరోతో కలిసి ఎంట్రీ
Malashree Daughter
Basha Shek

|

Aug 07, 2022 | 9:47 PM

Malashree Daughter: ప్రేమఖైదీ, బావబామ్మర్ది, పోలీస్‌ అల్లుడు, అల్లరి పోలీస్‌, బంగారు మొగుడు, తోడి కోడళ్లు.. ఇలా పలు హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది అలనాటి నటి మాలాశ్రీ (Malashree). కేవలం హీరోయిన్‌గానే కాకుండా లేడీఓరియంటెడ్‌ సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. 1990వ దశకంలో కన్నడ సినీ పరిశ్రమలో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్‌ భాషల్లోనూ నటించి ప్రేక్షకుల మెప్పుపొందింది. ఇప్పుడు ఆమె కూతురు రాథనా రామ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. కన్నడ నాట ఛాలెంజింగ్ స్టార్ గా పేరొందిన హీరో దర్శన్‌తో కలిసి వెండితెర రంగప్రవేశం చేయనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాబర్ట్’ ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో్ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన మాలాశ్రీ తనను ఆదరించినట్లుగానే తన కూతురిపై కూడా ప్రేమాభిమానాలు చూపాలని కోరింది. ‘రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్‌ నా సినిమాతో ప్రొడక్షన్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు సిల్వర్‌ స్ర్కీన్‌పైకి ఎంట్రీ ఇస్తోంది. చిన్నప్పటి నుంచి నా కూతురు నటి కావాలనుకుంటోంది. ఇందుకోసం ముంబైలో నటన, డ్యాన్స్ కూడా నేర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో రాణించేందుకు ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడుతోంది’ అని చెప్పుకొచ్చింది. కాగా మాలాశ్రీ భర్త, ప్రముఖ దివంగత నిర్మాత రాము గతేడాది కొవిడ్‌తో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమావార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu