ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా.. కన్ఫర్మ్ చేసిన ప్రముఖ నటి..!

ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా.. కన్ఫర్మ్ చేసిన ప్రముఖ నటి..!

'జిల్'‌ ఫేమ్ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 14, 2020 | 4:04 PM

‘జిల్’‌ ఫేమ్ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తైంది. కాగా రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారని ఆ మధ్యన వార్తలు రాగా.. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేశారు ఆమె. ఇందులో నటిస్తున్నట్లు భాగ్యశ్రీ తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభం అవ్వకముందు ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యా. ఇందులో నా పాత్ర చాలా బావుంటుంది అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇంకా కొన్ని కథలను వింటున్నానని వెల్లడించారు. కాగా మైనే ప్యార్‌ కియా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ఆ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నారు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో మాత్రమే నటించిన ఈ నటి.. ఒకానొక సమయంలో సినిమాలకు దూరమయ్యారు. గతేడాది కన్నడ చిత్రం సీతారామ కల్యాణతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో అడవి శేషు హీరోగా నటిస్తోన్న 2 స్టేట్స్‌ రీమేక్‌లోనూ భానుశ్రీ నటిస్తున్నారు.

Read This Story Also: మరో 30కి.మీలలో ఇల్లు ఉందనగా.. ‘కరోనా’తో వలస కూలీ మృతి..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu