సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ‘సర్కారు వారి పాట’.. మరో రికార్డుకు చేరువలో మహేశ్..

దక్షిణాదిన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉండే ఫాలోయింగే వేరు. తను ఏది చేసినా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతుంది. తాజాగా

  • uppula Raju
  • Publish Date - 10:20 am, Fri, 22 January 21
సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న 'సర్కారు వారి పాట'.. మరో రికార్డుకు చేరువలో మహేశ్..

దక్షిణాదిన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉండే ఫాలోయింగే వేరు. తను ఏది చేసినా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతుంది. తాజాగా ఆయన డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న సర్కారువారిపాట సినిమాలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేస్తోంది.

సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ సందర్భం లేకుండానే నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. లక్షకు పైగా ట్వీట్స్ తో ట్విట్టర్‌లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ట్రెండ్ ఎలాంటి ప్లానింగ్ లేకుండానే జరుగుతుంది. అలాగే ప్లాన్ చేసి ట్రెండ్ చేస్తే అది ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలుసు. ఇదే కొనసాగితే సర్కారు వారి పాట ట్యాగ్ 100 మిలియన్ మార్క్‌ను అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా నిలవనుంది. బహుశా వరల్డ్ సినిమాగా మరో రికార్డు ను కూడా సెట్ చెయ్యొచ్చు. ప్రస్తుతానికి 90 మిలియన్‌కు పైగా హ్యాష్ ట్యాగ్స్ పడ్డాయి. ఆ సెన్సేషనల్ రికార్డు కోసం ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది మరో రికార్డు క్రియేట్ చేసిన తమిళ దళపతి.. పండగ చేసుకుంటున్న మాస్టర్ ఫ్యాన్స్..