నాలుగు భాషల్లో… సల్మాన్‌ ‘దబాంగ్ 3’! 

తొలిసారి సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ బాధ్యతలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:15 pm, Wed, 21 August 19
నాలుగు భాషల్లో... సల్మాన్‌ 'దబాంగ్ 3'! 

తొలిసారి సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ బాధ్యతలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్‌గా మార్చారు. డిసెంబర్‌20న ‘దబాంగ్‌ 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సల్మాన్‌.. ‘కిక్‌2’, ‘ఇన్‌షాఅల్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

https://www.instagram.com/p/B1aheNJFDST/?utm_source=ig_web_copy_link