Top Actresses remuneration: ప్రతి ఇండస్ట్రీలోనూ హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. వారు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. అయితే బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది హీరోయిన్ల రెమ్యునరేషన్ కాస్త తక్కువనే చెప్పాలి. అక్కడ కొంతమంది హీరోయిన్లు, హీరోలకు ధీటుగా పారితోషికాన్ని తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం హీరో, హీరోయిన్ రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. అయినప్పటికీ తమ విజయాలు, డిమాండ్‌ని బట్టి కొంతమంది స్టార్ హీరోయిన్లకు బాగానే రెమ్యునరేషన్ అందుతుంటుంది. ఈ క్రమంలో కోలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్ల పారితోషికం వివరాలు ఇప్పుడు లీక్ అయ్యాయి. అందులో అందరూ ఊహించినట్లుగానే నయనతార టాప్‌లో ఉంది. (అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి స్వల్ప గాయాలు)
నయనతార: తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న నయనతార ఒక్కో సినిమాకు రూ.4కోట్లు తీసుకుంటారట..
కాజల్ అగర్వాల్: ఇక రెండో స్థానంలో చందమామ కాజల్ ఉన్నారు. ఇటు తెలుగు, అటు తమిళ్లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటారట. ఇటీవలే గౌతమ్‌తో మూడు ముళ్లు వేయించుకున్న కాజల్.. సినిమాల్లో కొనసాగుతానని అభిమానులకు భరోసా ఇచ్చారు.
త్రిష, తమన్నా: రెమ్యునరేషన్ విషయంలో చెన్నై బ్యూటీ త్రిష, మిల్కీ బ్యూటీ తమన్నా మూడో స్థానంలో ఉన్నారు. వీరిద్దరు ఒక్కో సినిమాకు రూ.1.50కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
శ్రుతీ హాసన్: ఆ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతున్నారు శ్రుతీ హాసన్. ఈ నేపథ్యంలో శ్రుతీ హాసన్ ఒక్కో సినిమాకు రూ.1కోటి తీసుకుంటున్నట్లు సమాచారం.
కీర్తి సురేష్: మహానటితో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ బ్యూటీ సినిమాకు కేవలం రూ.80లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్న కీర్తి.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం దూకుడును కనిపించనట్లు సమాచారం.
ఇక వీరితో పాటు అంజలి రూ.70లక్షలు, రెజీనా రూ.60లక్షలు, శ్రియ రూ.50 లక్షలు, ఐశ్వర్య రాజేష్, ప్రియా ఆనంద్, నివేథా పేతురాజ్, శ్రీ దివ్యలు రూ.40లక్షలు.. నివేథా, మంజిమా మోహన్ రూ.30లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరిలో శ్రద్ధా శ్రీనాధ్ చాలా తక్కువ తీసుకుంటున్నట్లు టాక్. ఆమె చేతిలో వరుస సినిమాలు ఉన్నప్పటికీ సినిమాకు శ్రద్ధా కేవలం రూ.10లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. (కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1,015 కొత్త కేసులు.. ముగ్గురు మృతి)