ప్లీజ్ నన్ను ఫాలో కావొద్దు.. దండం పెట్టి మరీ ప్రాధేయపడిన హీరోయిన్.. వీడియో వైరల్..

ప్లీజ్ నన్ను ఫాలో కావొద్దు.. దండం పెట్టి మరీ ప్రాధేయపడిన హీరోయిన్.. వీడియో వైరల్..

బాలీవుడ్ హీరోయిన్ రియాచక్రవర్తి ఆకస్మాత్తుగా రోడ్డు మీద ప్రత్యేక్షమయింది. బుధవారం ముంబైలోని బాంద్రాలో రోడ్డు పక్కన ఉన్న

Rajitha Chanti

|

Jan 20, 2021 | 9:03 PM

బాలీవుడ్ హీరోయిన్ రియాచక్రవర్తి ఆకస్మాత్తుగా రోడ్డు మీద ప్రత్యేక్షమయింది. బుధవారం ముంబైలోని బాంద్రాలో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా పూల బోకే కొనుగోలు చేసింది. రియా కారు దిగి పూల దుకాణంలో చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడున్నవారు ఆమెను గుర్తుపట్టి తమ ఫోన్లలో వీడియో తీయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

రోడ్డు పక్కన రియా పూల బొకే కొనడానికి వెళ్తుండగా.. అక్కడివారు గమనించి ఆమెను వీడియో తీయడం మొదలు పెట్టారు. దీంతో ఆమె వారిని “దయచేసి నన్ను ఫాలో కావొద్దు, ప్లీజ్ వీడియోలు తీయకండి” అంటూ ప్రాదేయపడింది. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ పుట్టిన రోజు సందర్భంగా రియా పూలు కొన్నదని సుశాంత్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కానీ వీటిపై రియా స్పందించలేదు. డ్రగ్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై రియా విడుదలైంది.

Also Read:

మరోసారి ట్రెండింగ్‌లో ‘సుశాంత్’.. ‘లెజెండ్ నెవర్ డైస్’ అంటూ వరుస ట్వీట్లు.. ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్స్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu