రియా జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే నటి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది.

  • Updated On - 2:41 pm, Tue, 6 October 20 Edited By:
రియా జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే నటి

Rhea Chakrobarthy News: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన నటి రియా చక్రవర్తికి మరో షాక్ తగిలింది. రియా, ఆమె సోదరుడు షోవిక్‌ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20వరకు పెంచుతూ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు తీర్పును ఇచ్చింది. విచారణలో రియా డ్రగ్స్‌ సరఫరాలో యాక్టివ్‌గా ఉందని.. ప్రతి డెలివరీ, పేమెంట్‌ ఆమెకు తెలుసని ఎన్సీబీ అధికారులు కోర్టుకు తెలిపినట్లు సమాచారం.

మరోవైపు తమకు బెయిల్‌ కావాలంటూ గత నెల 22న ముంబయి హైకోర్టును రియా, షోవిక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై 29న విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అయితే జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఈ కేసును సీబీఐ, ఎన్సీబీ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

దివ్యాంగుల కోసం ఉపాసన మంచి పనికి చెర్రీ సహకారం

‘వకీల్‌ సాబ్’‌ కోసం 20 రోజులు ఇచ్చిన పవన్‌..!