Republic Motion Poster: ప్ర‌జాస్వామ్యానికి అర్థం చెబుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌… స‌రిదిద్దుకుంటూ స‌క్ర‌మంగా సాగాల‌ని స‌ల‌హా…

ప్ర‌జ‌లు ఎన్నుకున్న నాయ‌కులు, శాస‌నాలు అమ‌లు చేసే ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు స‌రిదిద్దుకుంటూ...

Republic Motion Poster: ప్ర‌జాస్వామ్యానికి అర్థం చెబుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌... స‌రిదిద్దుకుంటూ స‌క్ర‌మంగా సాగాల‌ని స‌ల‌హా...
Follow us

| Edited By:

Updated on: Jan 25, 2021 | 6:15 PM

ప్ర‌జ‌లు ఎన్నుకున్న నాయ‌కులు, శాస‌నాలు అమ‌లు చేసే ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు స‌రిదిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌ప్పుడే అది ప్ర‌జాస్వామ్యమ‌ని అదే అస‌లైన రిప‌బ్లిక్ అని అంటున్నాడు టాలీవుడ్ సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ మెగా హీరో దేవాక‌ట్టా డైరెక్ష‌న్ లో రిప‌బ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. రాజ‌‌కీయాలు, ప్ర‌జాస్వామ్యం చుట్టూ తిరిగే క‌థాంశంతో రిప‌బ్లిక్ రానున్నట్టు మోష‌న్ పోస్ట‌ర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌రాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు మోష‌న్ పోస్ట‌ర్లో ప్ర‌క‌టించారు. కాగా క‌రోనా త‌ర్వాత మొద‌టి సినిమాగా వ‌చ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ సోలో బ‌తుకే సోబెట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.