‘డియర్ కామ్రేడ్’ డేట్ ఫిక్స్ చేసుకున్నాడా..!

గతేడాది ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’తో మంచి విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఒకటి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మే 22న ఈ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈ చిత్రంలో […]

‘డియర్ కామ్రేడ్’ డేట్ ఫిక్స్ చేసుకున్నాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 02, 2019 | 12:05 PM

గతేడాది ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’తో మంచి విజయాలను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో భరత్ కమ్మ దర్శకత్వంలో నటించిన ‘డియర్ కామ్రేడ్’ ఒకటి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మే 22న ఈ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

ఇక ఈ చిత్రంలో విజయ్ విద్యార్థి నాయకుడిగా కనిపించనుండగా.. ఆయన సరసన రష్మిక క్రికెట్ పాత్రలో నటించిందన్న టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu