రికార్డు క్రియేట్ చేస్తున్న ‘ది పార్టీ ఫ్రీక్’ సాంగ్.. రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించిన..

కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి న్యూ ఇయర్‌కు అదిరిపోయే ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ది పార్టీ ఫ్రీక్' సాంగ్‌ను కన్నడలో రిలీజ్ చేయగా

  • Publish Date - 9:01 am, Wed, 30 December 20
రికార్డు క్రియేట్ చేస్తున్న ‘ది పార్టీ ఫ్రీక్’ సాంగ్.. రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించిన..

కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి న్యూ ఇయర్‌కు అదిరిపోయే ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ది పార్టీ ఫ్రీక్’ సాంగ్‌ను కన్నడలో రిలీజ్ చేయగా రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ పార్టీ ఆంథెమ్‌ను తెలుగులోనూ రిలీజ్ చేశారు. అనీ మాస్టర్ కూడా స్టెప్స్ వేసిన సాంగ్‌ను తెలుగులో స్వయంగా చందన్‌ శెట్టి పాడగా, న్యూ ఇయర్ పార్టీలో ఫేవరెట్ సాంగ్‌గా మారనుంది.

క్యాచీవర్డ్స్, ఖతర్నాక్ మ్యూజిక్‌తో దూసుకుపోతున్న కిరాక్ సాంగ్‌కు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. న్యూ ఇయర్ పార్టీ ఆంథెమ్‌గా ప్రెండ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. యునైటెడ్ ఆడియో ‘ది పార్టీ ఫ్రీక్’ సాంగ్‌ను ప్రొడ్యూస్ చేయగా, కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయగా సంతో షంగా ఉందని చెప్పాడు చందన్ శెట్టి. కారబ్ సాంగ్‌ను ఆదరించిన ప్రేక్షకులు ఈ పాటను కూడా ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు.