Virata Parvam: రానా-సాయిపల్లవి మూవీ ‘విరాటపర్వం’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌.. ఎప్పుడంటే?

రానా దగ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం, రాజకీయం..

Virata Parvam: రానా-సాయిపల్లవి మూవీ ‘విరాటపర్వం’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌.. ఎప్పుడంటే?
Follow us

|

Updated on: Jan 28, 2021 | 6:39 PM

Rana Daggubati – Sai Pallavi: రానా దగ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం, రాజకీయం నిజజీవిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రివ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది విరాటపర్వం సినిమాకు ట్యాగ్‌లైన్‌. సంక్రాంతికి రానా-సాయిపల్లవి పోస్టర్‌ను రిలీజ్‌ చేసి ఆకట్టుకున్న మూవీ మేకర్స్‌ తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించి రానా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. విరాట‌ప‌ర్వం మూవీని వేసవికాలంలో ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌నున్నట్లు గురువారం మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వితోపాటు ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: