‘ఆర్‌ఆర్ఆర్‌’ కోసం రమా రాజమౌళి అదనపు బాధ్యతలు!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌధ్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కతోన్న

'ఆర్‌ఆర్ఆర్‌' కోసం రమా రాజమౌళి అదనపు బాధ్యతలు!

Rajamouli RRR movie: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌధ్రం రణం రుధిరం). ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కతోన్న ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 70శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రాజమౌళి సతీమణి మరో అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్‌ఆర్ సినిమా కోసం రమా రాజమౌళి మాటలు రాస్తున్నట్ల తెలుస్తోంది. సాధారణంగా జక్కన్న సినిమాలకు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసే రమా రాజమౌళి.. ఈ మూవీ కోసం అదనపు బాధ్యతలు కూడా తీసుకున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ అలియా భట్‌, ఒలివియా, అజయ్ దేవగన్‌, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం పది భారతీయ భాషల్లో విడుదల కానుంది.

Read More:

ఆమిర్‌ ఖాన్‌పై నెటిజన్ల విమర్శలు.. ఎందుకంటే

కరోనా రోగికి చికిత్స చేసిన ఎమ్మెల్యే.. కేటీఆర్ ప్రశంసలు

Click on your DTH Provider to Add TV9 Telugu