బన్నీ ఔట్.. చెర్రీ ఇన్‌!

బన్నీ ఔట్.. చెర్రీ ఇన్‌!

ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రీ లుక్‌ కూడా విడుదల అయ్యింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 2:36 PM

Ram Charan in Icon: ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఐకాన్ అనే చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది ప్రారంభంలో ఈ సినిమా ప్రీ లుక్‌ కూడా విడుదల అయ్యింది. అయితే ఈ తరువాత ఈ మూవీకి సంబంధించి ఇటు దర్శకుడు గానీ, అటు హీరో గానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇదిలా ఉంటే అందరికీ సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఇటీవల తన 21వ సినిమాను కొరటాలతో కన్ఫర్మ్ చేశారు బన్నీ. ఈ నేపథ్యంలో ఐకాన్ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇదే సమయంలో ఈ మూవీ కోసం నిర్మాత దిల్‌ రాజు, రామ్ చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఐకాన్‌లో చెర్రీ నటించనున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో తొలిసారిగా కలిసి నటిస్తున్నారు చెర్రీ. అలాగే చిరు ప్రధానపాత్రలో కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వీటి తరువాత ఇంకా చెర్రీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

Read This Story Also: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కేసు నమోదు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu