మొత్తానికి రాజమౌళిని ఒప్పించారుగా..!

మొత్తానికి రాజమౌళిని ఒప్పించారుగా..!

కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌ వీడింది. మెగాస్టార్ మూవీలో రామ్ చరణ్‌ ఖరారు అయ్యారు. అంతేకాదు ఇందులో చెర్రీ నటించేందుకు రాజమౌళి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 2:07 PM

కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌ వీడింది. మెగాస్టార్ మూవీలో రామ్ చరణ్‌ ఖరారు అయ్యారు. అంతేకాదు ఇందులో చెర్రీ నటించేందుకు రాజమౌళి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. అవును.. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. తన సినిమాలో చెర్రీ నటించేందుకు దర్శకధీరుడు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం చెర్రీని తీసుకోవాలని టీమ్‌ భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై చిరు సైతం మాట్లాడుతూ.. పాత్ర విన్న వెంటనే, దానికి చెర్రీనే సరిపోతాడని తాను, సురేఖ అనుకున్నామని అన్నారు. అయితే ప్రస్తుతం చెర్రీ ఆర్ఆర్ఆర్‌లో బిజీగా ఉండటం వలన.. ఇందులో నటించేందుకు ఇంకా డేట్లు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంలో కొరటాల శివ, రాజమౌళి మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక తాజాగా మాట్లాడుతూ.. ఇందులో చెర్రీ నటించేందుకు జక్కన్న ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ మూవీలో తామిద్దరం గురు, శిష్యుల పాత్రల్లో కనిపించబోతున్నామని కూడా చిరు వివరించారు.

ఇదిలా ఉంటే తన సినిమాల్లో నటించే నటులకు సాధారణంగా కొన్ని రూల్స్‌ను పెడుతుంటారు రాజమౌళి. ఒకసారి తన మూవీకి ఒప్పుకుంటే.. ఆ మూవీ విడుదలయ్యే వరకు హీరోలు మరో సినిమాను సంతకం చేయకూడదనే నిబంధనను రాజమౌళిని పెడుతుంటారన్న టాక్ టాలీవుడ్‌లో ఉంది. ఆ క్రమంలోనే చిరు మూవీలో నటించే విషయంపై చెర్రీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ఎట్టకేలకు చిరు, కొరటాల శివ ఇద్దరు కలిసి రాజమౌళిని ఒప్పించారని తెలుస్తోంది. ఏకంగా మెగాస్టార్ వచ్చి అడగడంతో రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

Read This Story Also: ‘లూసిఫర్‌’కు డైరెక్టర్ అతడేనట.. కన్ఫర్మ్ చేసిన చిరు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu