ఆ ముందు రోజు చాలా బావున్నారు కానీ.. ‘ఆషిఖి’ నటుడి గురించి పలు విషయాలు వెల్లడించిన నిషాంత్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్ స్ట్రోక్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

ఆ ముందు రోజు చాలా బావున్నారు కానీ.. 'ఆషిఖి' నటుడి గురించి పలు విషయాలు వెల్లడించిన నిషాంత్‌
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2020 | 12:36 PM

Rahul Roy brain stroke: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాహుల్‌ రాయ్‌ బ్రెయిన్ స్ట్రోక్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్గిల్‌లో షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురి కాగా.. ముందు శ్రీనగర్‌ నుంచి ముంబయికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కోలుకుంటున్నారని రాహుల్‌ సోదరుడు రోమీర్ వెల్లడించారు.

కాగా ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందోనన్న విషయాన్ని నటులు నిషాంత్‌ సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎల్‌ఏసీ-లైవ్‌ ద బాటిల్‌ మూవీలో‌ నిషాంత్‌ హీరోగా నటిస్తుండగా.. రాహుల్‌ కీలక పాత్రలో కనిపించారు. ”సోమవారం ఆయన చాలా బావున్నారు. కానీ మంగళవారం కాస్త డల్‌గా కనిపించారు. కార్గిల్‌లో వాతావరణ పరిస్థితులకు అలా ఉన్నారేమో అనుకున్నాము. ఇక మంగళవారం సాయంత్రానికి ఆయన తన డైలాగ్‌లు కూడా చెప్పలేకపోయారు. ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కార్గిల్‌లోని ఆసుపత్రికి తరలించాము.

అక్కడ బుధవారం జరిపిన సిటీ స్కాన్‌లో రాహుల్‌ ఆరోగ్యం బాలేదని తేలింది. దీంతో వెంటనే శ్రీనగర్‌కి అటు నుంచి ముంబయికి తరలించారు. మా మూవీ దర్శకుడు నితిన్‌ కుమార్ ఓ డాక్టర్‌.. అందుకే రాహుల్‌ పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసింది. అందుకే వెంటనే అప్రమత్తం అయ్యారు” అని చెప్పుకొచ్చారు. కాగా ఆషిఖి మూవీతో బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్‌.. ఆ మూవీ హిట్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాలతో పాటు టీవీ షోలలో ప్రత్యేక అతిథిగా కనిపించారు.

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?