చెర్రీతో పూరీ పాన్ ఇండియా మూవీ!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసింది డేరింగ్ అండ్‌ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

చెర్రీతో పూరీ పాన్ ఇండియా మూవీ!

Puri next with Cherry: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను టాలీవుడ్‌కి పరిచయం చేసింది డేరింగ్ అండ్‌ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఓ వైపు చెర్రీ ఆచితూచి సినిమాలు చేస్తుండటం.. మరోవైపు పూరీ ఎప్పటిలాగే స్పీడుగా దూసుకుపోతుండటంతో.. వీరి కాంబినేషన్‌ ఇప్పటివరకు సెట్ అవ్వలేకపోయింది.

అయితే టాలీవుడ్‌ తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరి కాంబోలో రెండో చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఇంకా చాలానే ఉంది. అయితే లాక్‌డౌన్ వేళ ఇంటికే పరిమితమైన పూరీ, చాలా కథలను రాసుకున్నారట. అందులో ఒకటి చెర్రీతో తీయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తోన్న చెర్రీ.. చిరు హీరోగా కొరటాల తెరకెక్కిస్తోన్న ఆచార్యలోనూ కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. నువ్వు తప్ప: కన్నీళ్లు పెట్టిస్తోన్న సుశాంత్ సోదరి పోస్ట్‌

 

Click on your DTH Provider to Add TV9 Telugu