హీరోలపై పూరి ‘ఇస్మార్ట్’ కామెంట్స్..

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో.. పూరి సంతోషానికి అవధులు లేవు.. ఈ సందర్భంగా పూరి మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతోన్నాయి. నేను హిట్‌ కొడతేనే ‘మహేష్ బాబు’ నాతో సినిమా చేస్తాడని.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పూరి. ఇప్పుడు.. బాలయ్య, మెగాస్టార్‌పై పూరి చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవుతోన్నాయి. మెగాస్టార్‌తో సినిమా చేయాలనేది నా కల అని.. ఆ ఛాన్స్ వచ్చినా.. నాలుగు […]

హీరోలపై పూరి 'ఇస్మార్ట్' కామెంట్స్..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 22, 2019 | 6:17 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో.. పూరి సంతోషానికి అవధులు లేవు.. ఈ సందర్భంగా పూరి మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతోన్నాయి. నేను హిట్‌ కొడతేనే ‘మహేష్ బాబు’ నాతో సినిమా చేస్తాడని.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పూరి. ఇప్పుడు.. బాలయ్య, మెగాస్టార్‌పై పూరి చేసిన వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవుతోన్నాయి.

మెగాస్టార్‌తో సినిమా చేయాలనేది నా కల అని.. ఆ ఛాన్స్ వచ్చినా.. నాలుగు సార్లు మిస్సయ్యింది అని అన్నారు. ‘ఆటో జానీ’ సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే.. సెకండాఫ్ చిరంజీవికి నచ్చకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని అన్నారు.

కాగా.. ఇక బాలయ్యతో సినిమా చేయడం చాలా సరదాగా ఉంటుందని తెలిపారు. బాలయ్యకు తెల్లవారు జామునే నిద్ర లేవడం అలవాటని.. ఆయనతో పాటే మమ్మల్ని నిద్రలేపుతారని అన్నారు. ఆయనకు దైవభక్తి ఎక్కువే.. బాలయ్యా.. ఐలవ్యూ అని పూరి చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu