ఆకట్టుకుంటున్న ‘ప్రేమకథా చిత్రం 2’ ట్రైలర్

ఆకట్టుకుంటున్న  ‘ప్రేమకథా చిత్రం 2’  ట్రైలర్

హైదరాబాద్‌: 2013 లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రం’ మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌పెటేషన్స్‌ లేకుండా ఓ సాదాసీదా లవ్ స్టోరీ అనుకున్న సినిమా కాస్త..రిలీజై నవ్వుల సునామి సృష్టించింది. కలెక్షన్ల వరద పారించింది. బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రం 2’ వస్తున్న సంగతి తెలిసిందే. సుమంత్‌ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు .హరి కిషన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. […]

Ram Naramaneni

|

Mar 08, 2019 | 12:47 PM

హైదరాబాద్‌: 2013 లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రం’ మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌పెటేషన్స్‌ లేకుండా ఓ సాదాసీదా లవ్ స్టోరీ అనుకున్న సినిమా కాస్త..రిలీజై నవ్వుల సునామి సృష్టించింది. కలెక్షన్ల వరద పారించింది. బాక్సాఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రం 2’ వస్తున్న సంగతి తెలిసిందే. సుమంత్‌ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు .హరి కిషన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

విమెన్స్‌ డేను పురస్కరించుకుని చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌లో నందితా శ్వేత దెయ్యంలా ప్రవర్తిస్తూ ఇతరులను భయపెట్టడం ఫన్నీగా ఉంది. సుమంత్‌, నందిత ప్రేమించుకుంటారు. సుమంత్‌.. సిద్ధి ఇద్నానీని కూడా ప్రేమిస్తాడు. ఓరోజు ఈ విషయం నందితకు, సిద్ధికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నందిత దెయ్యంలా ఎందుకు మారింది? అన్నదే కథ. జీవన్‌ బాబు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌పీఏ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుదర్శన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu