‘ఆర్ఆర్ఆర్‌’ కోసం మరో విప్లవ వీరుడు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో విప్లవ వీరుడు భాగం కాబోతున్నారు. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఈ సినిమాలో ఒక విప్లవ గేయాన్ని రాసి పాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కొమరం భీమ్‌పై ఓ పాట రాయమని రాజమౌళి, గద్దర్‌ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఆఫర్‌ను […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:38 am, Wed, 8 January 20
'ఆర్ఆర్ఆర్‌' కోసం మరో విప్లవ వీరుడు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో విప్లవ వీరుడు భాగం కాబోతున్నారు. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఈ సినిమాలో ఒక విప్లవ గేయాన్ని రాసి పాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కొమరం భీమ్‌పై ఓ పాట రాయమని రాజమౌళి, గద్దర్‌ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఆఫర్‌ను గద్దర్ కాదనలేక పోయారని., అందుకే ఓ పాటను రాసి పాటబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ పాట సినిమా హైలెట్‌లలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది.

కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న విడుదల కానుంది. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.