‘సాహో’ మేనియా.. ‘డై‌హార్డ్’ ఫ్యాన్ 13 గంటలు శ్రమించి..

'సాహో' మేనియా.. 'డై‌హార్డ్' ఫ్యాన్ 13 గంటలు శ్రమించి..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో ‘వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్  బాగా ఫేమస్ అయింది. ఆ డైలాగును నిజం చేస్తూ ఓ డై‌హార్డ్ ఫ్యాన్ ఏకంగా ప్రభాస్ కోసం ఓ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశాడు. ఒరిస్సాకు చెందిన సదరు అభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2019 | 3:17 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో ‘వాళ్లు నా ఫ్యాన్స్ కాదు.. డైహార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్  బాగా ఫేమస్ అయింది. ఆ డైలాగును నిజం చేస్తూ ఓ డై‌హార్డ్ ఫ్యాన్ ఏకంగా ప్రభాస్ కోసం ఓ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశాడు. ఒరిస్సాకు చెందిన సదరు అభిమాని 486 రూబిక్ క్యూబ్స్‌తో 13 గంటల పాటు శ్రమించి ప్రభాస్ ముఖచిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ అభిమాని ఆర్ట్‌కు ప్రశంసలు కురిపించారు.

మరోవైపు ‘సాహో’ అడ్వాన్స్ బుకింగ్‌లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ చిత్రం విడుదల తర్వాత మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu