‘సాహో’ను గుర్తు చేసుకున్న టీమ్‌!

సాధారణంగా ఓ సినిమా ఫ్లాప్ అయితే అందులో నటించిన వారు దాని గురించి వీలైనంత త్వరగా మర్చిపోతుంటారు. అయితే సాహో టీమ్‌ మాత్రం ఆ సినిమాను గుర్తు పెట్టుకుంది.

'సాహో'ను గుర్తు చేసుకున్న టీమ్‌!
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 31, 2020 | 3:19 PM

One Year of Saaho: సాధారణంగా ఓ సినిమా ఫ్లాప్ అయితే అందులో నటించిన వారు దాని గురించి వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సాహో టీమ్‌ మాత్రం ఆ సినిమాను గుర్తు పెట్టుకుంది. ఈ మూవీ విడుదలై ఒక ఏడాది అవుతుండగా.. దాన్ని గుర్తు చేసుకుంటూ ఇందులో నటించిన ప్రభాస్, శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. సాహో ఫలితాన్ని పక్కనపెడితే ఈ సినిమా వారికి ఎన్నో ఙ్ఞాపకాలను ఇచ్చింది. అందుకే వన్ ఇయర్ ఆఫ్ సాహో పేరుతో ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

కాగా బాహుబలి తరువాత ప్రభాస్ సాహోలో నటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ క్యాస్టింగ్‌, బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తరువాత అన్ని వర్గాలను సాహో ఆకట్టుకోలేకపోయింది. ఇక కలెక్షన్ల పరంగానూ తెలుగులో ఈ మూవీకి తక్కువనే వచ్చినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం మంచి వసూళ్లు లభించిన విషయం తెలిసిందే.

Read More:

రైనాపై చెన్నై జట్టు యజమాని సంచలన వ్యాఖ్యలు

డాలర్ బాయ్ ఒత్తిడితోనే ప్రదీప్‌, కృష్ణుడి పేర్లు చెప్పా: బాధితురాలు

https://www.instagram.com/p/CEgAYP2JaKp/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CEgM1t3J3nn/?utm_source=ig_embed

https://www.instagram.com/tv/CEgbXqMpa7I/?utm_source=ig_embed

https://www.instagram.com/tv/CEgsxHZJJ8a/?utm_source=ig_embed

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu