Prabhas Movie Update: ప్రభాస్ మూవీ షూటింగ్ అప్‏డేట్.. ఆసక్తికర విషయం పంచుకున్న బుట్టబొమ్మ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం

  • Rajitha Chanti
  • Publish Date - 3:00 pm, Sun, 17 January 21
Prabhas Movie Update: ప్రభాస్ మూవీ షూటింగ్ అప్‏డేట్.. ఆసక్తికర విషయం పంచుకున్న బుట్టబొమ్మ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ మూవీ చేయనున్నాడు.

తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ గురించి హీరోయిన్ పూజా హెగ్డే తన ఇన్‏స్టా వేదికగా ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ‘రాధేశ్యామ్’ మూవీలో తన షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లుగా తెలిపింది. ఈ మేరకు “రాధేశ్యామ్ 30 రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళ్తున్నాను” అంటూ తన ఇన్‏స్టా స్టోరీలో షేర్ చేసింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నట్లుగా తెలిపింది. ఇక రాధే‏శ్యామ్ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: సీటీమార్ రీ స్టార్ట్ : రెడీ అంటోన్న టీమ్..బరిలోకి గోపిచంద్

‘బ్రోచేవారెవరురా’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న నజ్రియా