హలో.. హలో.. కాస్త ఆగండి..! క్లారిటీ ఇచ్చిన పూజా..!

వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చలామణి అవుతోంది పూజా హెగ్డే. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. కాగా ఈ అమ్మడికి తమిళ్‌లో బిగ్ ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీ ద్వారానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా.. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని పుకార్లు గుప్పుమన్నాయి. సూర్యతో హరి తెరకెక్కించబోతోన్న ‘అరువా’లో […]

హలో.. హలో.. కాస్త ఆగండి..! క్లారిటీ ఇచ్చిన పూజా..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 3:29 PM

వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చలామణి అవుతోంది పూజా హెగ్డే. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బిజీబిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. కాగా ఈ అమ్మడికి తమిళ్‌లో బిగ్ ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీ ద్వారానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా.. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని పుకార్లు గుప్పుమన్నాయి.

సూర్యతో హరి తెరకెక్కించబోతోన్న ‘అరువా’లో హీరోయిన్‌గా పూజా ఫైనల్ అయినట్లు టాక్ నడిచింది. ఈ క్రమంలో ఆ పుకార్లపై ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. ”హలో హలో.. నేను తమిళ సినిమాలు చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చేయకండి. ఇంతవరకు నేను ఏ తమిళ సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం నెరేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో తమిళ సినిమా చేయాలని నేను ఎదురుచేస్తున్నా. ఒకవేళ అన్నీ కుదిరితే హ్యాపీ” అంటూ పూజా స్పష్టతను ఇచ్చేసింది. కాగా ప్రస్తుతం పూజ.. ప్రభాస్ 20వ చిత్రంలో, అఖిల్ సరసన మోస్ట్ బ్యాచులర్‌లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ సరసన ఓ సినిమాలో ఈ బ్యూటీ నటించబోతోంది.

Read This Story Also: ‘ఆర్ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్ రీల్‌ పెదనాన్న..!