లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: సినిమాల విషయంలో పవన్ సంచలన నిర్ణయం..!

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: సినిమాల విషయంలో పవన్ సంచలన నిర్ణయం..!

దాదాపు 2 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్‌.. ఇప్పటికే మూడు చిత్రాలకు ఓకే చెప్పారు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు.. రెండు సినిమాల షూటింగ్ కూడా ప్రారంభమైంది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 14, 2020 | 2:31 PM

దాదాపు 2 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్‌.. ఇప్పటికే మూడు చిత్రాలకు ఓకే చెప్పారు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు.. రెండు సినిమాల షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ మూడు చిత్రాల తరువాత మరికొన్ని సినిమాల్లో నటించేందుకు పవన్‌ కల్యాణ్ ఆసక్తిని చూపుతున్నారని.. ఈ క్రమంలో దర్శకులు సైతం కథలను రెడీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు సినిమాల తరువాత పవన్‌ మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు చిత్రాలను పవన్ వదిలేసినట్లు సమాచారం.

టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ప్రకటించిన మూడు చిత్రాల తరువాత బాబీ దర్శకత్వంలో ఓ మూవీలో.. డాలీ దర్శకత్వంలో మరో మూవీలో పవన్ నటించాలనుకున్నారట. ఈ సినిమాలన్నీ 2022కు పూర్తి చేయాలని ఆయన అనుకున్నారట. ఆ తరువాత మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించారట. 2024లో జరగనున్న ఎన్నికల కోసం రెండు సంవత్సరాల ముందు నుంచే ప్రచారం చేయాలని పవన్‌ అనుకున్నారట. కానీ లాక్‌డౌన్ నేపథ్యంలో మూవీ షూటింగ్‌లకు బ్రేక్‌ వచ్చింది. దీంతో ఇప్పుడు ఒప్పుకున్న ఈ మూడు చిత్రాలను పూర్తి చేయడానికే మరింత సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో మరో సినిమాకు సంతకం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఈ రెండు సినిమాలను ఆయన వదులుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండోసారి నటించబోతున్నారు పవన్.

Read This Story: జగన్‌దంతా రాజకీయమే… లాక్‌డౌన్ వద్దన్నారు.. కన్నా విసుర్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu