Katrina Kaif: మా పెళ్లికొచ్చేవారు ఇది పాటించండి.. అతిథులను అభ్యర్థిస్తోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు..

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది..

Katrina Kaif: మా పెళ్లికొచ్చేవారు ఇది పాటించండి.. అతిథులను అభ్యర్థిస్తోన్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు..
Follow us

|

Updated on: Nov 24, 2021 | 7:15 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇంట్లో ఇటీవలే కత్రినా- విక్కీల నిశ్చితార్థం జరగడం, వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలిసిందే. అయితే తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత పాటిస్తున్న ఈ ప్రేమ పక్షులు.. తమ పెళ్లి విషయంలోనూ అలాగే ప్రైవసీ పాటించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తమ వివాహానికి సంబంధించి ఏ ఒక్క సమాచారం వారికి తెలియకుండా బయటకు వెళ్లకూడదంటోంది. ఇందులో భాగంగా తమ వివాహానికి వచ్చే అతిథులకు ఇప్పటికే కండిషన్లు పెడుతున్నారట. పెళ్లికి హాజరయ్యేవారు మొబైల్‌ ఫోన్లు, వీడియో కెమెరాలు తీసుకురావొద్దని అభ్యర్థిస్తున్నారట.

కాగా గతంలో ప్రియాంకా చోప్రా- నిక్ జోనాస్, దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ దంపతులు కూడా తమ వివాహానికి వచ్చే అతిథులకు ఇలాగే మొబైల్ ఫోన్‌లు తీసుకు రావొద్దని రిక్వెస్టులు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కత్రినా – విక్కీలు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారని సమాచారం. తమ పెళ్లి ఏర్పాట్ల బాధ్యతలను ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి అప్పగించిన వీరు.. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని కోరారట. ‘ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యముంటుంది . కత్రినా, విక్కీలు కూడా అదే ఆలోచనలతో ఉన్నారు. తమ వ్యక్తిగత జీవితానికి భంగం కలగకూడదని వారు భావిస్తున్నారు. తమ అనుమతి లేకుండా పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ఫొటో, వీడియో కూడా బయటకు వెళ్లకూడదనుకుంటున్నారు. ఇందులో భాగంగా పెళ్లికి వచ్చే ప్రముఖులతో సహా వచ్చే అతిథులందరికి మొబైల్‌ ఫోన్లను వెంట తీసుకు రాకూడదని చెబుతున్నారు’ అని కత్రినా- విక్కీలతో సన్నిహితంగా మెలిగే ఒకరు చెప్పుకొచ్చారు.

Also Read:

Adah Sharma: అదా సొగసులకు ఫిదా కానీ కుర్రాడు ఉంటాడా.. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఈ బ్యూటీ..

Rashmika Mandanna: కుక్కపిల్లతో క్రేజీ హీరోయిన్ కయ్యలు.. వైరల్ అవుతున్న వీడియో..

Acharya Movie: “ఆచార్య” నుంచి అదిరిపోయే అప్డేట్.. రామ్ చరణ్ టీజర్ వచ్చేది అప్పుడే..

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..