F2 సీక్వెల్‌లో రవితేజ కాదు మరో హీరో..?

సంక్రాంతికి విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది ‘F2’ మూవీ. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ‌తీస్తానని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. F2 సీక్వెల్‌లో ముగ్గురు హీరోలు ఉంటారని.. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌తో పాటు మూడో హీరోగా రవితేజను తీసుకున్నారంటూ ఆ మధ్య వార్తలు రాగా.. తాజాగా యంగ్ హీరో నితిన్‌ను అనిల్ సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ యాసను నితిన్‌ పర్‌ఫెక్ట్‌గా […]

F2 సీక్వెల్‌లో రవితేజ కాదు మరో హీరో..?
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2019 | 6:53 AM

సంక్రాంతికి విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది ‘F2’ మూవీ. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ‌తీస్తానని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

F2 సీక్వెల్‌లో ముగ్గురు హీరోలు ఉంటారని.. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌తో పాటు మూడో హీరోగా రవితేజను తీసుకున్నారంటూ ఆ మధ్య వార్తలు రాగా.. తాజాగా యంగ్ హీరో నితిన్‌ను అనిల్ సంప్రదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ యాసను నితిన్‌ పర్‌ఫెక్ట్‌గా మాట్లాతాడు. అందుకే F2 కోసం అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.