‘అర్జున్ సురవరం’ ట్రైలర్… రిపోర్టర్ గా నిఖిల్!

ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిఖిల్. సోమవారం ‘ఆస్క్ అర్జున్ సురవరం’ అనే టైటిల్ తో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు.  మంగళవారం ‘అర్జున్ సురవరం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. […]

‘అర్జున్ సురవరం’ ట్రైలర్... రిపోర్టర్ గా నిఖిల్!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 20, 2019 | 3:23 PM

ఎట్టకేలకు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిఖిల్. సోమవారం ‘ఆస్క్ అర్జున్ సురవరం’ అనే టైటిల్ తో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు.  మంగళవారం ‘అర్జున్ సురవరం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిఖిల్ ఫ్యాన్స్ ట్రైలర్‌ను తెగ చూసేస్తున్నారు. ట్రైలర్ సూపర్‌గా ఉందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. నిఖిల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ సినిమా ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉంది. వాస్తవానికి ఇది తమిళ సినిమా ‘కనితన్’కు రీమేక్. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ ప్రధానాంశంగా కథ సాగుతుంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో అర్జున్ సురవరంను ఇరికిస్తారు. జర్నలిస్టు అయిన హీరో ఆ స్కామ్‌ను బయటపెట్టి అసలు నేరస్తులను చట్టానికి పట్టిస్తాడు. ఇదీ సింపుల్‌గా కథ. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో చూపించారు.

ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, కిశోర్, తరుణ్ అరోరా, ప్రగతి, విద్యుల్లేఖ రామన్, డెల్సన్ డిసౌజ, వాట్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. బి. మధు సమర్పణలో ఈరోస్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో దర్శకత్వం వహించిన టి.ఎన్.సంతోష్ తెలుగులోనూ తెరకెక్కించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..