పెళ్లి పనులు.. ఆ మూవీ నుంచి తప్పుకున్న నిహారిక..!

మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేజ్‌మెంట్‌ కాగా

  • Tv9 Telugu
  • Publish Date - 1:22 pm, Fri, 11 September 20
పెళ్లి పనులు.. ఆ మూవీ నుంచి తప్పుకున్న నిహారిక..!

Niharika movie News: మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేజ్‌మెంట్‌ కాగా.. డిసెంబర్‌లో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎంగేజ్‌మెంట్‌ అవ్వకముందు నిహారిక తమిళంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అశోక్ సెల్వన్ హీరోగా స్వాతిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ కథాంశంలో నటించేందుకు నిహారిక ఓకే చెప్పింది.. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి నిహారిక బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

మామూలుగా ఈ మూవీని ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకున్నారు. కానీ కరోనా వలన షూటింగ్‌లకు బ్రేక్ పడటం, ఈలోగా పెళ్లి పనులతో డేట్లు ఇష్యూ రావడంతో నిహారిక ఈ మూవీ నుంచి తప్పుకుందట. ఈ క్రమంలో ఆమె స్థానంలో యువ నటి మేఘా ఆకాష్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నట్లు టాక్.

Read More:

Breaking: ఏఆర్‌ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు

రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటిన రాజంపేట మాజీ ఎమ్మెల్యే