సైరా సినిమాలో నిహారిక పాత్ర ఇదేనట..!

సైరా సినిమాలో నిహారిక పాత్ర ఇదేనట..!

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణంతో పాటు నిహారిక కొణిదెల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిహారిక గిరిజన యువతిగా చిన్న క్యామియో రోల్ చేస్తోందట. అయితే ‘సైరా నరసింహ రెడ్డి’ కి ఒక ఆపద […]

Ravi Kiran

|

Feb 25, 2019 | 4:08 PM

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణంతో పాటు నిహారిక కొణిదెల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిహారిక గిరిజన యువతిగా చిన్న క్యామియో రోల్ చేస్తోందట. అయితే ‘సైరా నరసింహ రెడ్డి’ కి ఒక ఆపద సమయంలో ఆశ్రయం ఇచ్చే యువతిగా నిహారిక నటిస్తోందని సమాచారం. ఇప్పటికే ఆమె సీన్స్ ను చిత్రీకరించారట.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu