‘సైరా’లో చిరు తనయ.. మొత్తానికి హిట్‌ కొట్టేసింది

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కగా.. అక్టోబర్ 2న విడుదలైన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ మూవీలో మెగా డాటర్ నిహారిక ఓ చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో బ్రిటీష్ వారితో పోరాడేందుకు కధన రంగంలోకి దూకే బోయ పిల్ల పాత్రలో నిహారిక కనిపించింది. ఉన్నది కాసేపైనా […]

‘సైరా’లో చిరు తనయ.. మొత్తానికి హిట్‌ కొట్టేసింది
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 04, 2019 | 4:16 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కగా.. అక్టోబర్ 2న విడుదలైన ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ మూవీలో మెగా డాటర్ నిహారిక ఓ చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో బ్రిటీష్ వారితో పోరాడేందుకు కధన రంగంలోకి దూకే బోయ పిల్ల పాత్రలో నిహారిక కనిపించింది. ఉన్నది కాసేపైనా నిహారిక అందరినీ ఆకట్టుకుంది. దీంతో మొదటి సారి విజయాన్ని ఖాతాలో వేసుకుంది నిహారిక.

కాగా ‘ఒక మనసు’ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఆ తరువాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్య కాంతం’ చిత్రాల్లో కనిపించింది. అయితే ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. కానీ అనూహ్యంగా సైరా హిట్‌తో ఈ మెగా ప్రిన్సెస్‌కు కాస్త ఊరట లభించినట్లైంది. అయితే ‘సైరా’లో అవకాశం తనకు ఊరికే రాలేదని ఓ ఇంటర్వ్యూలో నిహారిక వెల్లడించింది. ‘‘డాడీ(వరుణ్, నిహారికలు చిరును డాడీ అని పిలుస్తారు) సినిమాలో ఒక చిన్న పాత్రను ఇవ్వాలని చరణ్ అన్నను చాలా రిక్వెస్ట్ చేశా.. అందుకు అన్న నన్ను కాదు డైరక్టర్‌ను అడుగు అని చెప్పాడు. ఆ తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డిని బ్రతిమలాడితో ఓ చిన్న పాత్ర ఉంది. కానీ ఆ పాత్రకు మాటలు ఉండవు. చేస్తావా అని అడిగాడు. పాత్ర ఎంతసేపు ఉన్నా సరే.. డాడీ సినిమాలో కనిపించాలి అని చెబితే ఓ బోయ పిల్లను పాత్రను ఇచ్చాడు’’ అంటూ తెలిపింది.

ఇదిలా ఉంటే సినిమా విజయం తరువాత చిరును కలిసిన నిహారిక మెగాస్టార్‌తో ఓ ఫొటోను తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘నేను మా డాడీని మాత్రమే హగ్ చేసుకోలేదు. భారత సినిమాకు గర్వకారణమైన వ్యక్తిని హగ్ చేసుకున్నా. మెగాస్టార్ అభిమానిగా నేను ఎప్పుడు గర్వపడతాను. లవ్ యు డాడీ’’ అంటూ కామెంట్ పెట్టింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu