గంగూలీ సర్‌ ‘వంటలక్క’ను చూడాలి.. ‘ఐపీఎల్’‌ టైమింగ్‌ని మార్చండి ప్లీజ్

ఐపీఎల్‌ 2020 పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇవాళ ప్రకటించనున్నారు

గంగూలీ సర్‌ 'వంటలక్క'ను చూడాలి.. 'ఐపీఎల్'‌ టైమింగ్‌ని మార్చండి ప్లీజ్
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 04, 2020 | 10:06 PM

Karthika Deepam Serial: ఐపీఎల్‌ 2020 పండుగ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇవాళ ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌ టైమింగ్‌ని రాత్రి గం.7.30ని.ల నుంచి 8గంటలకు మార్చాలని ఓ నెటిజన్‌ గంగూలీకి రిక్వెస్ట్ పెట్టారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన పవిత్రపు శివ చరణ్ అనే ఓ నెటిజన్‌.. ”గంగూలీ సర్‌ ఐపీఎల్‌ టైమింగ్‌ని రాత్రి గం.7.30ని.ల నుంచి 8గంటలకు మార్చండి. ఎందుకంటే మా కుటుంబం 7.30కి కార్తీక దీపం సీరియల్‌ని చూస్తుంది. మా ఇంట్లో ఒకే టీవీ ఉంది.అందుకే టైమింగ్‌ని మార్చి, మా ఇంట్లో గొడవలు రాకుండా చూడండి” అని కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్‌కి చెన్నై ఐపీఎల్‌, స్టార్‌ మా ఖాతాలను జత చేశాడు. దానికి నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరేమో హాట్‌స్టార్‌లో చూడు అని కామెంట్ పెడుతుండగా.. మరికొందరేమో నువ్వు సూపర్‌ బ్రో అంటున్నారు. ఇంకొందరేమో గృహలక్ష్మికి అన్యాయం జరుగుతుంది. తులసికి అన్యాయం చేయనివ్వం అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ట్వీట్‌పై స్టార్ మా కూడా స్పందించడం గమనర్హం. ఇదొక నిజాయితీతో కూడిన అభ్యర్థన అంటూ మాటీవీ కామెంట్ పెట్టింది.

కాగా కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్‌ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఈ సీరియల్‌కు మంచి డిమాండ్ ఉండగా.. దీనిపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా ట్రెండ్ అవుతుంటాయి.

Read More:

 ‘రావణ్’ పాత్రకు మొదటి ఛాయిస్ సైఫ్ కాదట.. ఆ టాప్ హీరోనట

ఓకే చెప్పిన ‘ఎఫ్‌ 2’ భామలు.. మరి హీరోల మాటేంటి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu