మెగా ఫ్యాన్స్ కు నాని పంచ్ ఇచ్చాడా..?

నాని హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఇక ఈ టైటిల్ నాని పెట్టుకున్నందుకు.. మెగా ఫ్యాన్స్ నానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఇక దీనిపై తాజాగా ‘జెర్సీ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పందించిన నాని.. మెగాస్టార్ చిరంజీవి కి తాను వీరాభిమానినని, ఆయన నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని ఇప్పటికీ అభిమానిస్తానని తెలిపాడు. అయితే ‘ఆ […]

మెగా ఫ్యాన్స్ కు నాని పంచ్ ఇచ్చాడా..?
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Apr 20, 2019 | 6:29 AM

నాని హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.  ఇక ఈ టైటిల్ నాని పెట్టుకున్నందుకు.. మెగా ఫ్యాన్స్ నానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేశారు.

ఇక దీనిపై తాజాగా ‘జెర్సీ’ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పందించిన నాని.. మెగాస్టార్ చిరంజీవి కి తాను వీరాభిమానినని, ఆయన నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని ఇప్పటికీ అభిమానిస్తానని తెలిపాడు. అయితే ‘ఆ సినిమాకు.. నా సినిమాకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. కాగా సినిమా విడుదలైన తర్వాత నా సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిలే సరైనదని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు అనిపిస్తుందని నాని స్పష్టం చేశాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu