యంగ్‌ హీరోతో నాని ‘హిట్’ కొడతాడా..!?

ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్‌ సినిమాను స్థాపించి.. అందులో మొదటి చిత్రంగా ‘అ!’ను తెరకెక్కించాడు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రాగా.. రెండు జాతీయ అవార్డులను కూడా సాధించింది. అయితే నానికి […]

యంగ్‌ హీరోతో నాని 'హిట్' కొడతాడా..!?
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 7:13 PM

ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్‌ సినిమాను స్థాపించి.. అందులో మొదటి చిత్రంగా ‘అ!’ను తెరకెక్కించాడు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రాగా.. రెండు జాతీయ అవార్డులను కూడా సాధించింది. అయితే నానికి మాత్రం ఈ మూవీతో అనుకున్నంత లాభాలు రాలేదు. కాగా ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమాకు సిద్ధమయ్యాడు నాని. ‘ఈ నగరానికి ఏమైంది’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఫలక్‌నుమాదాస్‌’తో అందరినీ ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ నాయుడుతో నాని రెండో సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సినిమా వేడుకలో క్లూను ఇచ్చిన నాని.. ఇప్పుడు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఈ మూవీకి హిట్ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ ద్వారా శైలేష్ అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. ఇందులో విశ్వక్‌సేన్ సరసన చి.ల.సౌ ఫేమ్ రుహానీ శర్మ నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక దీని గురించి నాని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘‘మరో వైవిధ్య కథతో, అద్భుత టాలెంట్‌ ఉన్న నటీనటులతో.. మిమ్మల్ని మెప్పించేందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ కామెంట్ పెట్టాడు. మరి యంగ్ హీరోతో నాని ఏ మేరకు ‘హిట్’ కొడతాడో చూడాలి.

ఇదిలా ఉంటే మరోవైపు నాని ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగండి దర్శకత్వలో వి చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు హీరోగా కనిపిస్తుండగా.. నాని పాత్రలో నటిస్తున్నాడు. నివేథా థామస్, అదితీరావు హైదారీ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..